Breaking News

నేపాల్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

Published on Sat, 01/03/2026 - 00:37

నేపాల్‌లోని భద్రాపూర్ విమానాశ్రయంలో ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి నది వైపు దూసుకెళ్లింది. అయితే.. కాస్త దూరం వెళ్లి ఆగిపోవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 9.08 గంటల సమయంలో చోటుచేసుకుంది. 

బుద్ధ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం 51 మంది ప్రయాణికులు, మరో నలుగురు విమాన సిబ్బందితో నేపాల్ రాజధాని కఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.23కు బయలుదేరిన విమానం.. 9.08 గంటలకు భద్రాపూర్ చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పింది. రన్‌వేను దాటుకుని 200 మీటర్ల దూరం వెళ్లి.. గడ్డిలోకి కూరుకుపోయింది. ఇంకాస్త ముందుకెళ్లి ఉంటే.. విమానం నదిలోకి పడిపోయి ఉండేది.


విమానం రన్‌వేపై నుంచి ముందుకు దూసుకుపోవడంతో భారీ కుదుపులు వచ్చాయి. దీంతో.. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు విమానాశ్రయ ప్రతినిధి రింజీ షెర్పా వెల్లడించారు. 

ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు బుద్ధ ఎయిర్‌వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ (సీఏఏఎన్) అధికార ప్రతినిధి జ్ఞానేంద్ర భుల్ వెల్లడించారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు