Breaking News

భారీ గ్రహశకలం పలకరించే వేళ..

Published on Tue, 09/16/2025 - 06:20

వాషింగ్టన్‌: మరో ఖగోళ అద్భుతానికి అంతరిక్షం వేదికకానుంది. ఈ నెలలోనే త్వరలో ఒక గ్రహశకలం సమీపంగా వచ్చి మన పుడమిని పలకరించి వెళ్లనుంది. 2025 ఎఫ్‌ఏ22 పేరున్న ఈ గ్రహశకలం పథాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ‘నియర్‌ ఎర్త్‌ అబ్జెక్ట్‌ స్టడీస్‌’ కేంద్రం నుంచి పరిశీలిస్తోంది. దీంతో పాటు అమెరికాలోని క్రిసెంటీ వ్యాలీలోని జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీ నుంచీ సైతం దీని గమనాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు.

 సెప్టెంబర్‌ 18వ తేదీ ఉదయం 8.33 గంటలకు భూమికి అత్యంత చేరువగా ఇది పయనించనుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ సమయంలో ఇది కేవలం 8,41,988 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకు పోనుంది. భూమికి ఇంత దగ్గరగా వెళ్తుండటంతో ఖగోళ శాస్త్ర వేత్తలు, అంతరిక్ష ఔత్సాహికుల్లో ఆసక్తి రెట్టింపైంది. అత్యంత శక్తివంతమైన రాడార్లు, ఆప్టికల్‌ టెలిస్కోప్‌ల సాయంతో దీనిని వీక్షించేందుకు ఉబలాటపడు తున్నారు. 

ఈ గ్రహ శకలం చుట్టుకొలత 163.88 మీటర్లు. పొడవు 280 మీటర్లు. అంటే ఇది ఢిల్లీలోని ప్రఖ్యాత కుతుబ్‌ మినార్‌ కంటే పెద్దది. ఇది 1.85 సంవత్సరాల్లో మన సూర్యుడిని ఒక చుట్టు చుట్టేస్తోంది. భూమికి అత్యంత సమీపంగా దూసుకుపోతున్నప్పటికీ గురు త్వాక ర్షణ ప్రభావ పరిధిలో ఇది లేదు. ఈ గ్రహశకలాన్ని ఈ ఏడాది తొలి నాళ్లలో తొలిసారిగా గుర్తించింది. హవాయీలోని పనోరమిక్‌ సర్వే టెలిస్కోప్, ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌(పాన్‌–స్టార్‌2) ఈ గ్రహశ కలాన్ని మార్చి 29వ తేదీన గుర్తించింది. 2173 సెప్టెంబర్‌ 21వ తేదీన ఇది భూమికి అత్యంత చేరువగా వచ్చే ప్రమాదముంది.  
 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)