Breaking News

రక్షణ వ్యయం పెంపుకు నాటో అంగీకారం

Published on Thu, 06/26/2025 - 05:00

ద హేగ్‌: యుద్ధాల నేపథ్యంలో ‘నాటో’ సభ్యదేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రక్షణ బడ్జెట్‌లను పెంచుకోవాల్సిందేనన్న ట్రంప్‌ ఒత్తిడికి తలొగ్గాయి. 2035 నుంచి తమ జీడీపీలో 5 శాతాన్ని రక్షణ బడ్జెట్‌ కోసం కేటాయించేందుకు అంగీకరించాయి. నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరం వేదికగా జరుగుతున్న నాటో సదస్సు బుధవారం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా 32 దేశాల అగ్రనేతలు పాల్గొన్నారు. 

కూటమిలో ఏదైనా దేశంపై నాటోయేతర దేశం దాడికి దిగితే నాటో దేశాలన్నీ ఐక్యమై ఉమ్మడిగా దాడిచేయాలన్న తమ నిబద్దతను ‘ది హేగ్‌’ డిక్లరేషన్‌ పునరుద్ఘాటించింది. రక్షణ బడ్జెట్‌ను నాటో దేశాలు పెంచుకునేలా చేయడం అమెరికా సాధించిన ఘన విజయమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 

బడ్జెట్‌ను పెంచుకోవడం ద్వారా మా కూటమికి మరో ఒక ట్రిలియన్‌ డాలర్ల మేర ఆర్థికదన్ను దక్కుతుందని ట్రంప్‌ అన్నారు. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం తన తరం కాదని స్పెయిన్‌ ఇప్పటికే తెగేసి చెప్పింది. సదస్సుకు విచ్చేసిన సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్‌ విడిగా సమావేశమయ్యారు. నాటో బడ్జెట్‌ పరోక్షంగా రష్యా దురాక్రమణకు అడ్డుకట్టవేసేందుకు అక్కరకొస్తుంది జెలెన్‌స్కీతో ట్రంప్‌ అన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)