Breaking News

Paper Airplane Day: నూతన ఆవిష్కరణలకు నాంది

Published on Mon, 05/26/2025 - 11:05

బాల్యంలో పేపర్‌తో ఎయిర్‌ప్లేన్ తయారు చేసి, ఆనందంతో చిందులు వేస్తూ, ఆడుకోని వారు ఎవరూ ఉండరు. గాలిలో ఎరురుతున్న విమానాన్ని అద్బుతంగా చూసే చిన్నారులు దాని నమూనాను తయారు చేయడంలోనూ పోటీ పడుతుంటారు. పేపర్‌ ప్లేన్‌(Paper plane)లను తయారు చేసి, పోటీలు పడుతూ విసురుకుంటారు. ఇలాంటి పేపర్‌ ప్లేన్‌లకు ఒక ప్రత్యేకమైన రోజు ఉందనే సంగతి మీకు తెలుసా? ఈ రోజు(మే 26) నేషనల్ పేపర్ ఎయిర్‌ప్లేన్ డే. అందుకే ఈ రోజుకున్న ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు చూద్దాం.

నేషనల్ పేపర్ ఎయిర్‌ప్లేన్ డే(National Paper Airplane Day) ప్రతి  ఏటా మే 26న జరుపుకుంటారు. ఈ రోజు కాగితంతో తయారు చేసిన విమాన బొమ్మలను ఎగురవేస్తుంటారు. సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు, విమాన శాస్త్రం గురించి తెలుసుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశంగా నేషనల్ పేపర్ ఎయిర్‌ప్లేన్ డేను నిర్వహిస్తుంటారు. కాగితపు విమానాల చరిత్ర  ఎంతో పురాతనమైనది. రెండు వేల  ఏళ్ల క్రితం చైనాలో కాగితంతో చేసిన విమానాల ఆవిష్కరణ మొదలయ్యింది.

చైనాలో క్రీ.పూ. 105లో కాగితంతో విమానాన్ని తయారు చేశారని చెబుతుంటారు. జపాన్‌లో కాగితం మడత పెట్టే కళ అయిన ఒరిగామి కాగితపు విమానాల తయారీకి ప్రేరణగా నిలిచిందని అంటారు. 19వ శతాబ్దంలో కాగితం విమానాలు శాస్త్రీయ పరిశోధనలకు ఉపయుక్తమయ్యాయి. రైట్ సోదరులు (విల్బర్, ఆర్విల్ రైట్) తమ విమాన రూపకల్పనలను పరీక్షించేందుకు కాగితం నమూనాలను ఉపయోగించారు. ఇది 1903లో ఇది వారి చారిత్రాత్మక విమానం తయారీకి దారితీసింది. కాగితం విమానాలు కేవలం బొమ్మలుగానే కాకుండా, విమాన శాస్త్రంలో ఆవిష్కరణలకు ఒక సాధనంగానూ సేవలందించాయి.

నేషనల్ పేపర్ ఎయిర్‌ప్లేన్ డే నాడు పలు దేశాల్లో పోటీలు(Competitions),  అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2012లో జో అయూబ్ అనే వ్యక్తి  రూపొందించిన కాగితం విమానం 226 అడుగుల 10 అంగుళాల (69.14 మీటర్లు) దూరం ఎగిరి రికార్డును సృష్టించింది. తాకువో తోడా అనే వ్యక్తి 27.9 సెకన్ల పాటు గాలిలో పేపర్‌ విమానాన్ని ఎగురవేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. నాసా లాంటి సంస్థలు కాగితం విమాన డిజైన్‌లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటాయి. మీరు కూడా ఈ రోజు చక్కని కాగితపు విమానాలను తయారు చేసి, గాలిలో ఎగువేసి ఆనందించండి.  

ఇది కూడా చదవండి: Gaza: వైమానిక దాడుల్లో 9 మంది పిల్లలను కోల్పోయి.. ఐసీయూలో చేరిన వైద్యుడు

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు