Breaking News

అంతరిక్ష కేంద్రానికి నలుగురు 

Published on Sat, 02/14/2026 - 06:31

కేప్‌ కెనావెరాల్‌:  అంతరిక్ష అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నుంచి అనారోగ్య కారణాలతో భూమికి తిరిగివచ్చిన నలుగురు వ్యోమగాముల స్థానాన్ని మరో నలుగురు భర్తీ చేయబోతున్నారు. అమెరికాలోని కేప్‌ కెనావెరాల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి ఈ నలుగురు స్పేస్‌ఎక్స్‌ సంస్థ రాకెట్‌లో శుక్రవారం బయలుదేరారు. శనివారం ఐఎస్‌ఎస్‌కు చేరుకుంటారు. దాదాపు తొమ్మిది నెలలపాటు అక్కడే ఉంటారు. అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకుంటారు. వీరిలో ఇద్దరు అమెరికా వ్యోమగాములు జెస్సికా మెయిర్, జాక్‌ హాథ్‌వే, ఫ్రాన్స్‌ వ్యోమగామి సోఫీ అడెనోట్, రష్యా వ్యోమగామి ఆండ్రీ ఫెడియేవ్‌ ఉన్నారు.

 అనారోగ్యానికి గురైన నలుగురు వ్యోమగాములను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’గత నెలలో అత్యవసరంగా వెనక్కి రప్పించింది. భూమికిపైకి చేరుకోగానే వెంటనే ఆసుపత్రిలో చేరి్పంచి, చికిత్స ప్రారంభించారు. వారు ఎవరు? ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నదానిపై నాసా గోప్యత పాటిస్తోంది. వివరాలు బహిర్గతం చేయడంలేదు. అంతరిక్ష ప్రయోగాల్లో నిమగ్నమైన వ్యోమగాములను ఇలా హఠాత్తుగా మధ్యలోనే వెనక్కి రప్పించడం ఐఎస్‌ఎస్‌ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

ఐఎస్‌ఎస్‌లో నాలుగు స్థానాలు ఖాళీ కావడంతో ప్రయోగాలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే నలుగురిని అక్కడికి పంపించడానికి నాసా చర్యలు చేపట్టింది. ఎలాన్‌ మస్క్‌ సారథ్యంలోని స్పేస్‌ఎక్స్‌ సంస్థ సహకారంతో ఆ పని పూర్తిచేసింది. నలుగురు అస్ట్రోనాట్లతో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ విజయవంతంగా ఐఎస్‌ఎస్‌ వైపు దూసుకెళ్లింది. ఈ బృందానికి జెస్సికా మెయిర్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఐఎస్‌ఎస్‌లో ప్రస్తుతం ముగ్గురు వ్యోమగాములు విధుల్లో ఉన్నారు. కొత్తగా నలుగురి రాకతో వారి సంఖ్య ఏడుకు చేరుకోబోతోంది. ఐఎస్‌ఎస్‌లో ప్రయోగాలు ఇక యథాతథంగా కొనసాగుతాయి. ప్రస్తుతం వాయిదా పడిన స్పేస్‌వాక్‌లు మళ్లీ మొదలవుతాయి.  

రెండో ఫ్రాన్స్‌ మహిళగా అడెనోట్‌ రికార్డు  
చందమామతోపాటు అంగారక యాత్రలకు నాసా సిద్ధమవుతోంది. భవిష్యత్తులో అక్కడికి మానవ సహిత యాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ యాత్రలు విజయవంతం కావాలంటే వ్యోమగాముల ఆరోగ్యం అత్యంత కీలకం. అంతరిక్ష నౌకల్లో ఉండే వనరులు ఉపయోగించుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పరీక్షలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన రెండో ఫ్రాన్స్‌ మహిళా వ్యోమగామిగా సోఫీ అడెనోట్‌ రికార్డుకెక్కారు. 1996లో క్లాడీ హెగ్‌నెరీ రష్యా స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లొచ్చారు. అప్పట్లో సోఫీ అడెనోట్‌ వయసు కేవలం 14 ఏళ్లు. క్లాడీ హెగ్‌నెరీ సాధించిన విజయాలు చూసి స్ఫూర్తి పొందారు. కేప్‌ కెనావెరాల్‌ నుంచి సోఫీ అడెనోట్‌కు హెగ్‌నెరీ వీడ్కోలు పలకడం విశేషం. జాక్‌ హాథ్‌వే ఐఎస్‌ఎస్‌కు వెళ్లడం ఇది తొలిసారి. జెస్సికా మెయిర్, ఆండ్రీ ఫెడియేవ్‌ రెండోసారి వెళ్తున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో వారికి చక్కటి అనుభవం ఉంది.   
 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు