Breaking News

పెర్సి ల్యాండింగ్‌ : అద్భుతం, తొలి ఆడియో

Published on Tue, 02/23/2021 - 08:40

వాషింగ్టన్‌: మార్స్‌పై  జరుగుతున్న పరిశోధనల క్రమంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అంగారక గ్రహంపై ‘పర్సవరన్స్రోవర్‌ ల్యాండ్‌ అవుతున్న అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. ‘‘రోవర్‌లోని మైక్రోఫోన్ మార్స్ నుండి వచ్చే శబ్దాలను  ఆడియో రికార్డింగ్‌ను అందించింది. ఇలాంటి శబ్దాలను, వీడియోను సాధించడం ఇదే మొదటిసారి..ఇవి నిజంగా అద్భుతమైన వీడియోలు" అని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ డైరెక్టర్ మైఖేల్ వాట్కిన్స్ ఆనందంగా ప్రకటించారు. ఫిబ్రవరి 18న ఈ ల్యాండింగ్‌ను రికార్డు చేసేందుకు 7 కెమెరాలను ఆన్ చేశామని, రోవర్‌లో రెండు మైక్రోఫోన్లు, 25 కెమెరాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తామని నాసా  సైన్స్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్  వెల్లడించారు. (పెర్సి సక్సెస్‌.. మార్స్‌ ఫోటోలు షేర్‌ చేసిన నాసా)

పర్సవరన్స్ రోవర్ శుక్రవారం అరుణగ్రహంపై ల్యాండ్ అయినసంగతి తెలిసిందే. ఇది రెడ్ ప్లానెట్‌లో ప్రవేశించిన, డీసెంట్ అండ్‌ ల్యాండింగ్ (ఇడీఎల్) చివరి నిమిషాల్లో ప్రధాన మైలురాళ్లను రికార్డు చేసింది. రోవర్ ల్యాండ్ కావడానికి ముందు పారాచూట్ విచ్చుకోవడంతో పాటు, అది కిందకి దిగుతున్న సమయంలో మూడు నిమిషాల 25 సెకన్ల పాటు కొనసాగే హై-డెఫినిషన్ వీడియో క్లిప్‌ను సాధించాం ఈ సందర్భంగా మార్స్ ఉపరితలం కూడా వీడియోలో కనిపించింది. గ్రహానికి  దగ్గరవుతున్న కొద్దీ మరింత స్పష్టంగా కనిపించింది. అక్కడి నేలంతా ఎర్రగా ఉంది. రోవర్ అరుణగ్రహంపై దిగుతున్న సమయంలో లేచిన ధూళి మేఘం, పారాచూట్‌ సాయంతో వ్యోమనౌక నుంచి కిందకి దిగడం స్పష్టంగా  కనిపించిందని నాసా ఇంజనీర్లు ప్రకటించారు. 

Videos

ఆపరేషన్ సిందూర్ పై మోదీ కీలక ప్రకటన

అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ కు బ్రేక్..

గిల్ కోసం కోహ్లి బలి.. ఇదంతా గంభీర్ కుట్ర!

జమ్మూలోని సరిహద్దు గ్రామాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్

స్పీడ్ పెంచిన మెగా స్టార్.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు

రాజమౌళి సెంటిమెంట్ కి భయపడుతున్న మహేష్ బాబు

ఉగ్రవాదులతోనే మా పోరాటం

భారత్, పాకిస్థాన్ DGMOల భేటీ వాయిదా

దేశంలో 32 విమానాశ్రయాలు రీఓపెన్

బాహుబలి చేప

Photos

+5

పెళ్లయి 13 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ స్నేహ ఇలా (ఫొటోలు)

+5

గంగమ్మ జాతరలో మంచు మనోజ్ దంపతులు (ఫొటోలు)

+5

మదర్స్‌ డే స్పెషల్.. అమ్మలతో సెలబ్రిటీల పోజులు (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం.. తొలి నటుడిగా రికార్డ్ (ఫొటోలు)

+5

నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో సందర్శకుల సందడే సందడి (ఫొటోలు)

+5

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు (ఫొటోలు)

+5

వీరజవాన్‌ మురళీ నాయక్‌ అంతిమ వీడ్కోలు.. జైహింద్‌.. అమర్‌రహే నినాదాలు (ఫొటోలు)

+5

‘లెవన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)