Breaking News

ఇంకా ముందుగానే సునీతా విలియమ్స్‌ రాక!

Published on Fri, 02/14/2025 - 17:12

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మరింత ముందుగానే భూమ్మీదకు రానున్నారా?. మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌తో ఎనిమిది నెలలుగా ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోనే  చిక్కుకుపోయిన ఆమెను వెనక్కి రప్పించే ప్రక్రియ మరింత వేగవంతం కానుందా?.. అసలు మేటర్‌ ఏంటంటే..

మార్చి నెలాఖరులో లేదంటే ఏప్రిల్‌ మొదటి వారంలో క్రూ-10 మిషన్‌ నిర్వహించాలని నాసా భావించింది. ఈ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ రాకెట్‌ ద్వారా ఐఎస్‌ఎస్‌(ISS)కు పంపాలనుకుంది. అయితే ఈ ప్రయోగంలోనే సునీత, విల్‌మోర్‌లను తిరిగి భూమ్మీదకు రప్పించేందుకు స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్‌ క్యాప్సూల్‌ ‘ఎండేవర్‌’ను వినియోగించబోతోంది. 

తొలుత మార్చి 25వ తేదీన ఈ ప్రయోగాన్ని షెడ్యూల్‌ చేయగా ఇప్పుడది ముందుకు జరిగింది. మార్చి 12వ తేదీనే ఈ ప్రయోగం నిర్వహించబోతున్నారని నాసా(NASA) ధృవీకరించింది.  ఈ కొత్త టీం అక్కడికి చేరుకోగానే.. -క్రూ-9లో వెళ్లిన సునీతా విలియమ్స్‌(Sunita Williams), విల్‌మోర్‌లు రిలీవ్‌ అవుతారు. అలా డ్రాగన్‌ క్యాప్సూల్‌ ఎండేవర్‌ ద్వారా ఇద్దరు భూమ్మీదకు రావడానికి మార్గం సుగమం అవడమే కాకుండా ఐఎస్‌ఎస్‌ నిర్వహణ కూడా నిలిచిపోకుండా ఉండగలుగుతుందన్నమాట. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మార్చి 19వ తేదీన సునీత, విల్‌మోర్‌లు భూమ్మీద అడుగుపెట్టే అవకాశాలున్నాయి .

ఇక క్రూ-10లో వెళ్లే నలుగురు వోమగాములు 150 రోజుల తర్వాత అంటే ఈ జులైలో స్పేస్‌ ఎక్స్‌కే చెందిన ఎండూరెన్స్‌  క్యాప్సూల్‌ ద్వారా భూమ్మీదకు చేరుకుంటారు. 

కిందటి ఏడాది జూన్‌లో బోయింగ్‌ స్టార్‌లైనర్‌ ద్వారా క్రూ-9 మిషన్‌లో భాగంగా సునీత సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. అయితే.. స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వోమగాములు నిక్‌ హేగ్‌, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌లు మాత్రమే తిరిగి భూమ్మీదకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి సునీత, విల్‌మోర్‌లు స్పేస్‌ స్టేషన్‌లోనే ఉండిపోయారు. 

ఇదీ చదవండి: యాక్సియోమ్‌ మిషన్‌-4లో భారతీయుడు

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)