Breaking News

ఐఎస్‌ఎస్‌కు భారతీయ సంతతి వ్యోమగామి మీనన్‌

Published on Sat, 07/11/2026 - 04:30

వాషింగ్టన్‌: భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్‌ మీనన్‌ (49) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) పయనం కానున్నాడు. ఈ నెల 14న కజకిస్తాన్‌లోని బైకనూర్‌ కోస్మోడ్రోమ్‌ నుంచి రోస్‌కోస్మోస్‌ సోయుజ్‌ ఎంఎస్‌29 వ్యోమనౌకలో రష్యన్‌ కొస్మోనాట్లు ప్యోటర్‌ డుబ్రోవ్, అన్నా కికినాతో కలిసి ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఎనిమిది నెలలపాటు గడపనున్నాడు. 

దీర్ఘకాలంపాటు అంతరిక్ష ప్రయాణం చేస్తే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు మీనన్‌ ఐఎస్‌ఎస్‌లో ప్రయోగాలు నిర్వహించనున్నారు. అతితక్కువ గురుత్వాకర్షణ శక్తి పరిస్థితుల్లో శరీరంలో రక్త ప్రసరణతోపాటు సిరల నిర్మాణం, రక్తసాంద్రతల్లో వచ్చే మార్పులను పరిశీలిస్తారు. అంతరిక్ష కేంద్రంలోని తాగునీటి వ్యవస్థతో ఐవీఫ్లూయిడ్స్‌ను తయారు చేసేందుకు సిద్ధం చేసిన టెక్నాలజీలను పరీక్షిస్తారు. 

ఇలాంటి మిషన్లలో భూమి నుంచి ఎలాంటి వైద్యసాయం అవసరం లేకుండానే ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, ఏఐలతో పనిచేయగల టెక్నాలజీలను పరీక్షిస్తారు. కంప్యూటర్లు, ఏఐ, వైద్య పరికరాలకు అవసరమైన సెమీకండక్టర్‌ స్ఫటికాల తయారీ పద్ధతులను సమీక్షిస్తారు. కేరళ నుంచి అమెరికా వలస వెళ్లిన శంకరన్, ఉక్రెయిన్‌ నుంచి వలస వచ్చిన లిసా సామోయిలింకోల సంతానమైన అనిల్‌ మినియాపోలిస్‌లో జని్మంచారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)