Breaking News

వెలుగు స్తంభాలు

Published on Thu, 11/28/2024 - 04:23

నేల నుంచి నింగికి వేసిన కాంతి నిచ్చెనల్లా ఉన్నాయి కదూ! పశ్చిమ కెనడాలో మైనస్‌ 30 డిగ్రీల చలితో వణికిపోతున్న ఆల్బర్టా ప్రాంతంలో దర్శనమిస్తున్న ఈ నిట్టనిలువు వెలుతురు స్తంభాల సోయగాలు చూపరుల మనసు దోస్తున్నాయి. ఇవి ఏర్పడాలంటే పర్యావరణపరంగా పలు అంశాలు కలిసి రావాల్సి ఉంటుంది. 

–10 నుంచి –40 డిగ్రీల మధ్యలో వాతావరణం అతి శీతలంగా, హెచ్చు తేమతో, గాలన్నదే వీయకుండా స్తబ్ధుగా ఉండాలి. అలాంటి వాతావరణంలో 0.02 మి.మీ. మందంతో కూడిన బుల్లి మంచు రేణువులు నిట్టనిలువుగా కాకుండా నేలకు కాస్త సమాంతరంగా కిందకు పడుతూ ఉండాలి. వాటి గుండా కాంతి నిర్దిష్ట కోణాల్లో ప్రసరిస్తే ఆ మంచు రేణువులు లక్షలాది బుల్లి అద్దాలుగా మారతాయి. వాటిపై పడుతూ కాంతి ఊహాతీతమైన తీరులో పరావర్తనం చెందుతుంది. 

ఫలితంగా ఇలాంటి నిలువు వెలుగులు సాక్షాత్కరిస్తాయి. ఆ కాంతికి మూలం వీధి దీపాలు మొదలుకుని చంద్ర కిరణాల దాకా ఏదైనా కావచ్చు. కెనడాతో పాటు అలస్కా, రష్యా తదితర చోట్ల అతి శీతల ప్రాంతాల్లో ఇవి తరచూ ఏర్పడుతుంటాయి. ఇవి నిజానికి కేవలం ఓ దృశ్య భ్రాంతి మాత్రమేనని సైంటిస్టులు అంటారు. వాళ్లేం చెప్పినా స్థానికులు వీటిని మానవాతీత శక్తి తాలూకు విన్యాసాలుగా నమ్ముతుంటారు. ఎగిరే పళ్లేల్లాగే ఇవి కూడా గ్రహాంతరవాసుల వాహనాలని భావిస్తారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)