Breaking News

ఇరాన్‌పై అనుమానాస్పద దాడులు 

Published on Sat, 07/11/2026 - 04:13

దుబాయ్‌: ఇరాన్‌పై వరుసగా వైమానిక దాడులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. తాము దాడులు పూర్తిస్థాయిలో నిలిపివేశామని అమెరికా ప్రకటించిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. తాజా అనుమానాస్పద దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకున్నది ఎవరన్నది అంతుబట్టడం లేదు. 

దివంగత సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీని ఖననం చేయడానికి ఇరాన్‌ సన్నద్ధమవుతున్న తరుణంలోనే గురువారం దక్షిణ ఇరాన్‌లోని వివిధ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయి. దీనికి కారణం ఎవరన్న దానిపై ఇరాన్‌ కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా సాగిస్తున్న ప్రచారానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) మద్దతు ఇస్తోందంటూ ఇరాన్‌ చట్టసభ సభ్యుడు ఒకరు ఆరోపించారు. అమెరికాకు సహకరించినందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

ఇటీవల అమెరికా చేసిన దాడుల్లో యూఏఈ తెర వెనుక పాత్ర పోషించిందని మండిపడ్డారు. ఇరాన్‌పై తాజా వైమానిక దాడుల పట్ల గల్ఫ్‌ దేశాలు కూడా స్పందించలేదు. ఇరాన్‌ బద్ధశత్రువైన ఇజ్రాయెల్‌ కూడా మౌనం వహించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లకు కీలక జలమార్గమైన హార్మూజ్‌ జలసంధిని తక్షణమే తెరవాలని, నౌకల రవాణాకు వీలు కల్పించాలని అమెరికా పట్టుబడుతున్న తరుణంలో ఇరాన్‌పై వరుసగా దాడులు జరిగాయి. హార్మూజ్‌ ఇకపై పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండాలని, నౌకలు రాకపోకలు సాగించాలంటే తమకు రుసుములు చెల్లించాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది.  

నాలుగు దేశాల్లో మిస్సైల్‌ అలర్ట్‌ సైరన్లు  
ఇరాన్‌లోని బుషెహర్, సిస్తాన్, బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లతోపాటు అహవాజ్, చాబహార్, ఇతర ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయని, పలుచోట్ల పేలుళ్లు చోటుచేసుకున్నాయని స్థానిక మీడియా గురువారం సాయంత్రం వెల్లడించింది. అయితే, గురువారం ఉదయం తర్వాత తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. సాయంత్రం జరిగిన వైమానిక దాడులతో తమకు సంబంధం లేదని వివరణ ఇచ్చాయి. అయితే, ఇరాన్‌ సైతం ప్రతీకార దాడులకు దిగింది. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్‌లో పలు లక్ష్యాలపై విరుచుకుపడింది

. నాలుగు దేశాల్లో మిస్సైల్‌ అలర్ట్‌ సైరన్లు వినిపించాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. కువైట్‌లో ఒకరు గాయపడినట్లు సమాచారం. ఇరాన్‌ దాడికి దిగిన వెంటనే కువైట్‌ అమీర్‌(పాలకుడు)తో సమావేశం కావడానికి యూఏఈ నాయకుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ కువైట్‌కు వెళ్లారు. ఖతార్‌ విదేశాంగ మంత్రితో గల్ఫ్‌ అరబ్‌ దేశాల నేతలు ఫోన్‌లో మాట్లాడారు. ఇంతకుముందు యుద్ధ సమయంలో ఇరాన్‌పై అనేక వైమానిక దాడులు జరిగాయి. 

తమ ఇంధన కేంద్రాలపై ఇరాన్‌ చేసిన దాడులకు ప్రతీకారంగా సౌదీ అరేబియా, యూఏఈలు ఇరాన్‌పై వైమానిక దాడులు చేశాయని అధికారులు తర్వాత తెలిపారు. ఇరాన్‌పై తాజా దాడులకు ఏదో ఒక గల్ఫ్‌ దేశం కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గురువారం రాత్రి ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మాట్లాడారు. గల్ఫ్‌లో అమెరికా తీసుకుంటున్న చర్యల గురించి ట్రంప్‌ నెతన్యాహుకు తెలియజేశారు. అవసరమైతే ఇరాన్‌ను ఎదుర్కోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ తేల్చిచెప్పారు.  

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)