Breaking News

సెల్‌ ఫోన్‌ను సైతం మోయలేనని అనిపించింది..! 

Published on Sat, 08/02/2025 - 06:14

వాషింగ్టన్‌: యాగ్జియం స్పేస్‌ మిషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని భార రహిత స్థితిలో గడిపి భూమిపైకి వచ్చిన తర్వాత భూగురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడే క్రమంలో ఎదురైన ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. గురుత్వాకర్షణ శక్తి ఎంత అవసరమో భూమిని వీడాకనే తమకు తెలిసిందన్నారు.

 ‘ఒక్కసారిగా భార రహిత స్థితిలోకి మారిపోగా దానికి అలవాటు పడేందుకు కొంత సమయం పట్టింది. అదేవిధంగా, భూమికి తిరిగొచ్చాక కూడా తిరిగి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడాల్సి వచ్చింది’ అని వివరించారు. క్యాప్సూ్యల్‌లోంచి బయటకు వచ్చాక సెల్‌ ఫోన్‌ సైతం పట్టుకోలేనంత బరువుగా మారిపోవడం తనకు ఆశ్చర్యం వేసిందని తెలిపారు.  భూమి పైకి వచ్చిన కొన్ని వారాల తర్వాత సైతం అడ్జెస్ట్‌ కావడం కష్టమవుతుందని, పడిపోకుండా నిలబడటం, అడుగులు వేయడం సైతం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పారు.

 అందుకే, వ్యోమగాములకు ప్రత్యేక రిహాబిలిటేషన్‌ కార్యక్రమం ద్వారా బలం కూడదీసుకోవడం, శరీర అవయవాల సమన్వయం, బ్యాలెన్స్‌ వంటివి ఒక్కటొక్కటిగా అలవాటయ్యాయన్నారు. అంతరిక్షంలో ఉన్నప్పటి మాదిరిగానే వదిలేసిన ల్యాప్‌టాప్‌ గాల్లోనే తేలియాడుతుందని భావించి, రూంలోనే దాన్ని పడేశాన ని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతరిక్షంలో శూన్య గురుత్వాకర్షణ శక్తిలో అన్నీ తేలియాడుతూనే ఉంటాయి. అటువంటి భారరహిత స్థితిలోనే తనకు అప్పగించిన ప్రయోగాలన్నిటినీ విజయవంతంగా నెరవేర్చానన్నారు. ‘ఇప్పుడంతా మునుపటిలాగానే మారిపోయింది. మరో స్పేస్‌ మిషన్‌కు సిద్ధంగా ఉన్నా’అంటూ ఆయన ప్రకటించారు. శుభాంశు అంతరిక్ష కేంద్రంలో ఉంటూ చేపట్టిన ప్రయోగాల డేటా, సేకరించిన నమూనాలు ఇప్పటికే అమెరికా నుంచి భారత్‌లోని పరిశోధన శాలలకు చేరాయి. త్వరలో భారత్‌కు రానున్న శుభాంశు శుక్లా ఆ ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలకు వివరించనున్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)