Breaking News

మార్కో ఫినిష్డ్‌

Published on Sat, 02/15/2025 - 10:42

అతనో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌. పాతికపైగా దేశాలకు మోస్ట్‌వాంటెడ్‌ కూడా.  అలాంటోడు.. కిందటి ఏడాది జరిగిన గ్యాంగ్‌ వార్‌లో చచ్చాడని కథనాలు వచ్చాయి. అతని ప్రేయసి కూడా బోరుమనడంతో అందరూ అది నిజమేనని నమ్మారు. కట్‌ చేస్తే.. ఇప్పుడు నిజంగానే ఆ క్రిమినల్‌ ఓ ఆగంతకు కాల్పుల్లో హతమయ్యాడు!.

డచ్‌ డ్రగ్‌ డీలర్‌.. మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ మార్కో ఎబ్బెన్‌(Marco Ebben) ఎట్టకేలకు హతమయ్యాడు. మెక్సికోలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. నెదర్లాండ్స్‌కు చెందిన మార్కో ఎబ్బెన్‌ యూరప్‌ దేశాలకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు. 2014-15 మధ్యకాలంలో మార్కో, అతని అనుచరులు 400 కేజీల కొకైన్‌ను పైనాపిల్స్‌(Pineapples)లో స్మగ్లింగ్‌ చేయడం వార్తల్లోకి ఎక్కింది.  

బ్రెజిల్‌(Brazil) నుంచి నెదర్లాండ్స్‌కు, ఇతర యూరోపియన్‌ దేశాలకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలను అక్రమ రవాణా చేసినట్లు అభియోగాలున్నాయి. 2020లో డచ్‌ కోర్టు అతనికి ఏడేళ్ల శిక్ష విధించగా.. పోలీసుల చెర నుంచి పరారయ్యాడు. అయితే అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు కిందటి ఏడాది అక్టోబర్‌లో మార్కో పెద్దడ్రామానే ఆడాడు. 

క్యూలికాన్‌లో జరిగిన గ్రూప్‌వార్‌లో అతను చనిపోయినట్లు ప్రచారం చేయించాడు.పైగా అతని ప్రేయసి మార్కో డెడ్‌బాడీని గుర్తు పట్టినట్లు ఆ డ్రామాలో భాగమైంది కూడా.‌ అయితే ప్రస్తుతం అతన్ని కాల్చి చంపింది ఎవరనేదానిపై అధికారిక  ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇదీ చదవండి: డాలర్‌తో గేమ్స్‌ వద్దు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)