Breaking News

పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి.. రష్యా సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 12/30/2025 - 00:31

ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సంబంధించి జరుగుతున్న దౌత్య ప్రయత్నాల మధ్య రష్యా–ఉక్రెయిన్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని మాస్కో సోమవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంది. యుద్ధ విరమణ చర్చలపై తమ వైఖరిని మార్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకారం... ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం మధ్యలో మాస్కో–సెంట్ పీటర్స్‌బర్గ్ మధ్య ఉన్న నోవ్గొరడ్ ప్రాంతంలోని పుతిన్ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మొత్తం 91 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. అయితే వాటన్నింటినీ రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.ఈ ఘటనకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌లోని కొన్ని లక్ష్యాలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు లావ్రోవ్ తెలిపారు. యుద్ధం ముగింపుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న రష్యా చర్చల వైఖరిని పునఃసమీక్షిస్తాం అని హెచ్చరించారు.

ఇదే సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. అమెరికా నేతృత్వంలో సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికే రష్యా ఈ విధమైన ప్రమాదకర ప్రకటనలు చేస్తోందని ఆయన విమర్శించారు. పుతిన్ నివాసంపై దాడి జరిగిందన్న కథనం పూర్తిగా కల్పితం. ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులకు, ముఖ్యంగా కీవ్‌పై దాడులకు న్యాయబద్ధత కల్పించేందుకే రష్యా ఈ కథనాన్ని ప్రచారం చేస్తోంది. అలాగే, యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికీ ఇదే కారణం అని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఈ పరిణామాలతో రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న శాంతి ప్రయత్నాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)