Breaking News

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. ఎయిర్‌పోర్టులు మూసివేత

Published on Wed, 08/23/2023 - 08:58

మాస్కో: మాస్కో శివార్లలో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయగా వాటిని కూల్చేశామని తెలిపింది పుతిన్ సైన్యం. దీంతో అప్రమత్తమై నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపింది రష్యా రక్షణ శాఖ. 

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో విరుచుకుపడింది. మాస్కో సరిహద్దుల్లోని బ్రియాన్‌స్క్‌ ప్రాంతంలో క్రాస్నోగోర్స్క్ పట్టణంలో  నాలుగు డ్రోన్లు ప్రవేశించడంతో వాటిని రష్యా సైన్యం కూల్చివేసింది. గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడటంతో అప్రమత్తమై ముందు జాగ్రత్తగా వ్నుకోవో, షెరెమెట్యెవో, డొమోడెడెవో, జుకోవ్‌స్కీ ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలను నిలిపివేశారు రష్యా అధికారులు. 

రష్యా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడులను ముమ్మరం చేసిందని గత ఆదివారం కూడా జరిగిన దాడుల్లో డ్రోన్లు రైల్వే స్టేషన్ పైకప్పు భాగంలోకి దూసుకుపోగా ఐదుగురు ప్రాణాలు కోలోయారని గుర్తు చేశారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్లో సుమారు 50 మంది ఉండగా మరణించిన ఐదుగురిలో ఇద్దరు ఆసుపత్రికి తరలించడానికి నిరాకరించారని మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో మరణించారని తెలిపారు. 

అంతకుముందు ఇదే కుర్స్క్ ప్రాంతానికి చెందిన వొల్ఫినోలో కూడా ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇటీవలి కాలంలో మరింత బలాన్ని వెనకేసుకున్న  ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో కోల్పోయిన ఒక్కో ప్రాంతాన్ని మెల్లగా తిరిగి చేజిక్కించుకుంటోంది.    

ఇది కూడా చదవండి: కార్చిచ్చును వంటింట్లో మంటలతో పోల్చిన జో బైడెన్ 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)