Breaking News

పాక్‌లో బడిబయట 2.5 కోట్ల బాలలు

Published on Sun, 11/16/2025 - 06:09

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ వ్యాప్తంగా కనీసం 2.5 కోట్ల మంది బాలలు బడిబయటే ఉన్నారు. వీరిలో కనీసం 2 కోట్ల మంది బడి ముఖమే ఎరుగరు. ఏ విద్య సంస్థలోనూ పేరు నమోదు చేయించుకోని 1,084 మంది ట్రాన్స్‌ జెండర్‌ బాలలు సైతం వీరిలో ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్తాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(పీఐఈ) విడుదల చేసిన నివేదిక మీడియాలో ప్రసారమవుతోంది. అందరికీ విద్య అందుబాటులో లేదనే విషయం ఈ నివేదికతో స్పష్టమవుతోందని సామాజికవేత్తలు అంటున్నారు. 

స్కూలుకు వెళ్లని బాలలు అత్యధికంగా 96 లక్షల మంది పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఉన్నారు. ఆ తర్వాత సింథ్‌లో 78 లక్షలు, ఖైబర్‌ ప్రావిన్స్‌లో 49 లక్షలు, బలూచిస్తాన్‌లో 29 లక్షలమంది బాలలు అక్షరజ్ఞానానికి నోచుకోవడం లేదని నివేదిక తెలిపింది. సాక్షాత్తూ దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో 6–16 ఏళ్ల మధ్యనున్న కనీసం 89 వేల మంది బాలలు బడి బయటే గడుపుతున్నట్లు పీఐఈ తెలిపింది. దేశంలో ఇటువంటి వారి సంఖ్య ఏడాదికి 20వేల చొప్పున పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)