Breaking News

Moon Sniper: జపాన్ ల్యాండరుకు శ్రద్ధాంజలి

Published on Sun, 01/21/2024 - 06:49

అవరోహణలో అదుపు తప్పి వేగంగా కిందికి దూసుకెళ్లలేదు. పట్టు తప్పి ధడేల్మని పడిపోలేదు. కూలిపోలేదు... ధ్వంసమవలేదు. చంద్రుడి ఉపరితలంపై దిగడానికైతే సాఫీగానే దిగింది ‘స్లిమ్’ ల్యాండర్. కానీ... తూలిపోయింది! తన ఐదు కాళ్లపై తాను సొంతంగా నిలబడలేకపోయింది. స్వతంత్రంగా నిలదొక్కుకోలేకపోయింది. షియోలీ బిలం వాలులో కిందికి దిగగానే దొర్లి తల కిందికి పెట్టి కాళ్లు పైకెత్తింది. శీర్షాసనం భంగిమలో ఉండిపోయింది.

‘మూన్ స్నైపర్’ దిగీ దిగగానే నెమ్మదిగా పూవు రెక్కల్లా విచ్చుకుని  ఆకాశంలోని సూర్యుడిని చూస్తూ కరెంటు తయారుచేసి శక్తినివ్వాల్సిన ల్యాండర్ పై భాగంలోని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్).. ల్యాండర్ తలకిందులవటంతో జాబిలి నేలవైపు ఉండిపోయాయ్. సౌరశక్తి అందే మార్గం మూసుకుపోయింది. ఇక.. ‘స్లిమ్’ ల్యాండరులోని ఆన్బోర్డ్ (ఇన్ బిల్ట్) బ్యాటరీ కొన్ని గంటలు పనిచేసి ఈపాటికి ‘డెడ్’ అయివుంటుంది. ‘మూన్ స్నైపర్’ తనంతట తాను పైకి లేచి నిటారుగా నిలబడే ఏర్పాటు, అవకాశం లేవు. అంటే... పవర్ కోల్పోయిన ల్యాండర్ ఈసరికే మూగబోయి శాశ్వత నిద్రలోకి జారుకుని వుంటుంది. మిషన్ కథ ఇక ఇక్కడితో పరిసమాప్తం.

జపాన్ సాధించింది పరిపూర్ణ విజయమా? పాక్షిక విజయమా? కనీస విజయమా? అని ప్రశ్న వేసుకుంటే... అది తన ప్రయత్నంలో విఫలం మాత్రం కాలేదనే చెప్పాలి. తమ ‘స్లిమ్’ వ్యోమనౌక అధ్యాయం ముగిసిందనే వార్తను జపాన్ అంతరిక్ష సంస్థ ఈ రోజు కాకపోతే రేపైనా, కొంచెం ఆలస్యంగానైనా అటు స్వదేశంలోనూ, ఇటు బాహ్య ప్రపంచానికి అధికారికంగా ప్రకటించాల్సివుంటుంది. సరిగ్గా తన ల్యాండింగ్ సమయంలో చంద్రుడి మీదికి ‘మూన్ స్నైపర్’ జారవిడిచిన రెండు (LEV-1 & 2) లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్స్... భూమికి ఏం సమాచారం ప్రసారం చేశాయో పరిశీలించాల్సివుంది. దిగేటప్పుడు ల్యాండరును ఈ జంట రోవర్లు తీసిన చిత్రాలు, వీడియో వెల్లడికావలసివుంది. జంట రోవర్లు పంపిన డేటాను ప్రాసెస్ చేశాక ‘జాక్సా’ ఏం చెబుతుందో వేచిచూద్దాం. 
-జమ్ముల శ్రీకాంత్

చదవండి: అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు!

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు