Breaking News

అజ్ఞాతం వీడనున్న మొజ్తబా ఖమేనీ.. త్వరలో తొలి బహిరంగ సభ

Published on Sun, 07/12/2026 - 13:58

టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బహిరంగంగా ఎక్కడా కనిపించని మొజ్తబా ఖమేనీ వచ్చే వారంలో తొలిసారి ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో అయాతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ అత్యున్నత నాయకునిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, అప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించలేదు.

తాజాగా తన తండ్రి అయాతొల్లా అలీ ఖమేనీ జ్ఞాపకార్థం జూలై 23న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు టెహ్రాన్‌లో మొజ్తబా ఖమేనీ స్మారక సభను నిర్వహించనున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా హాజరవుతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారిక ప్రకటనలో దివంగత నేతను ‘అమర ముజాహిద్ ఇమామ్’గా అభివర్ణించారు.

తండ్రి అంత్యక్రియలకు దూరం
ఇటీవల జరిగిన అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనలకు కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హాజరుకాలేదు. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లాలో వేలాది మంది సమక్షంలో జరిగిన ఈ సభలో మొజ్తబా సోదరులు ముగ్గురు (మొస్తఫా, మేసమ్, మసౌద్ ఖమేనీ) మాత్రమే ప్రార్థనలు జరిపారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన అయాతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, 14 నెలల మనవరాలి శవపేటికలను ఈ అంత్యక్రియల్లో పక్కపక్కనే ఉంచారు. దేశంలోనే అత్యున్నత పదవిని చేపట్టినప్పటికీ, ఈ అంత్యక్రియల్లో మొజ్తబా కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)