Breaking News

మేఘపై ఎంఐటీ  క్రమశిక్షణ చర్య

Published on Sun, 06/01/2025 - 05:11

మస్సాచుసెట్స్‌: పాలస్తీనా అనుకూల ప్రసంగం చేసిన భారత సంతతికి చెందిన మేఘ వేమూరిపై మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మేఘ పేరును ప్రస్తావించకుండా ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. ‘ఆ వ్యక్తి నేడు జరిగే స్నాతకోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. అయితే, ఈ రోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించామన్న విషయాన్ని తెలియజేశాం’అని ఎంఐటీ ప్రతినిధి కింబర్లీ అలెన్‌ చెప్పారు. ‘ఎంఐటీ వాక్‌ స్వాతంత్య్రానికి మద్దతుగా నిలుస్తుంది.

 ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా, పదే పదే నిర్వాహకులను తప్పుదారి పట్టించి, వేదికపై నుంచి నిరసనకు నాయకత్వం వహించింది. ఒక ముఖ్యమైన వేడుకకు అంతరాయం కలిగించినందుకు ప్రతిస్పందనగా తీసుకున్న చర్యకు కట్టుబడి ఉన్నాం’అని తెలిపారు. గురువారం మేఘ పాలస్తీనాకు అనుకూలంగా చేసిన ప్రసంగం ఆన్‌లైన్‌లో వైరలవుతోంది. కాగా, శుక్రవారం జరిగే స్నాతకోత్సవం ప్రధాన కార్యక్రమంలో మేఘ షెడ్యూల్‌ ప్రకారం ప్రసంగించాల్సి ఉంది. అయితే, వివాదం నేపథ్యంలో ఆమెకు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)