Breaking News

ఇజ్రాయెల్‌లో అద్భుతం.. తెగిన తలను అతికించారు..

Published on Fri, 07/14/2023 - 19:30

ఇజ్రాయెల్: తెగిపోయిన బాలుడి తలను తిరిగి అతికించి అద్భుతం సృష్టించారు ఇజ్రాయెల్ డాక్టర్లు. సైకిల్ తొక్కుతుండగా కారు ఢీకొట్టడంతో 12 ఏళ్ల బాలుడి తల మెడ నుండి దాదాపుగా తెగిపోయింది. సుదీర్ఘంగా సాగిన సర్జరీ విజయవంతమైనా డాక్టర్లు ఆ బాలుడు డిస్చార్జి అయ్యేంత వరకు విషయం బయటకు చెప్పలేదు.    

12 ఏళ్ల సులేమాన్ హాసన్ సైకిల్ తొక్కుతుండగా ఓ కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బాలుడి తలభాగం మెడ నుండి వేరయింది. వెన్ను భాగానికి పుర్రె వేలాడుతూ ఉంది. వెంటనే బాలుడిని హదస్స త్ మెడికల్ సెంటరుకు తరలించగా అక్కడి డాక్టర్లు ఎమర్జెన్సీ కేర్ లో ఉంచి ట్రీట్మెంట్ ప్రారంభించారు. 

హదస్స త్ మెడికల్ సెంటరులోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ ఒహాడ్ ఎయినావ్ తెలిపిన వివరాల ప్రకారం బాలుడు అడ్మిట్ అయ్యే సమయానికి అతడి తల మొండెం దాదాపుగా వేరయ్యాయి.. బ్రతికే అవకాశం కూడా 50% మాత్రమే. దీన్ని బైలేటరల్ అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్ లోకేషన్ గా పిలుస్తుంటాం. బ్రతుకుతాడో లేదో తెలియని పరిస్థితుల్లోనే మేము సర్జరీ ప్రారంభించాము. 

బాలుడుని బ్రతికించడానికి మా బృందం ఆపరేషన్ థియేటర్లో చాలా గంటలపాటు శ్రమించాము. చివరికి తలను యధాతధంగా అతికించగలిగామని తెలిపారు.  బాలుడు ఎప్పటిలాగే తన పనులు తాను చేసుకుంటున్నాడు.  అంతటి మేజర్ సర్జరీ అయినా కూడా ఎవ్వరి సాయం లేకుండా నడవగలుగుతున్నాడు. అతడి శరీరంలోని అవయవాలు, ఇంద్రియాలూ, శరీర భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని చెప్పారు. 

ఈ సంఘటన గత నెలలో జరగగా బాలుడు పూర్తిగా కోలుకున్నాక గాని ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని ఉద్దేశ్యంతోనే గుప్తంగా ఉంచామన్నారు ఆసుపత్రి సిబ్బంది. బాలుడిని డిశ్చార్జి చేసే రోజున డాక్టర్లు ఆ బాలుడితో ఫోటో తీసుకుని విషయాన్ని వివరించారు.

ఇది కూడా చదవండి: Pakistan Crisis : ఆర్ధిక సంక్షోభంతో ఆస్తులను అమ్ముకుంటున్న పాకిస్తాన్.. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)