Breaking News

చనిపోయిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి!

Published on Fri, 12/01/2023 - 11:22

వైద్యులను దేవునితో సమానమని అంటారు. అయితే వారు కూడా మనుషులే అయినందున ఒక్కోసారి పొరపాటు పడుతుండవచ్చు. మెక్సికోలోని శాన్ లూయిస్ పొటోసికి చెందిన వైద్యుని పొరపాటుకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మూడేళ్ల బాలిక చనిపోయినట్లు ఒక వైద్యుడు నిర్ధారించాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇంతలో ఆ బాలిక మేల్కొంది. మెక్సికోకు చెందిన కైమెలియా రోక్సానా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబసభ్యులు బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స అనంతరం  ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యుడు నిర్థారించాడు. 

ఇది జరిగిన 12 గంటల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఆ బాలిక సజీవంగానే ఉందని తెలిసింది. కైమెలియా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు, ఆమె తల్లికి తన కుమార్తె  బతికేవుందని అనిపించింది. దీంతో ఆమె శవపేటికను తెరవమని అక్కడున్నవారిని కోరింది. అయితే వారు అందుకు అంగీకరించలేదు. కాగా కొంతసేపటికి శవపేటికలో నుంచి బాలిక ఏడుపు వినిపించింది. వెంతనే దానిని తెరిచి, బాలికను బయటకు తీశారు. ఈ సంఘటన 2022, ఆగస్టు 17 న జరిగింది. దీంతో ఆ చిన్నారికి మరుజన్మ లభించిందని పలువురు పేర్కొన్నారు. 

అయితే ఆ బాలిక చనిపోయిందని వైద్యులు  ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందనే విషయానికొస్తే.. కడుపు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆ చిన్నారిని సాలినాస్ డి హిల్డాల్గో కమ్యూనిటీ ఆసుపత్రిలో చేర్చినప్పుడు, చికిత్స సమయంలో ఆమె గుండెచప్పుడు ఆగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలికలో చలనం రాకపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. 

అయితే ఆ బాలిక తల్లి  ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. తన కూతురు చనిపోలేదని అంటూ గట్టిగా ఏడవసాగింది. అంత్యక్రియల ప్రక్రియ జరుగుతున్నప్పుడు  ఆ బాలక తల్లి తన కుమార్తె శవపేటికలో వణుకుతున్నదని అక్కడున్నవారికి చెప్పింది. అయితే వారెవరూ నమ్మలేదు. ఆ బాలిక శవపేటికలో నుంచి ఏడుస్తూ, తన తల్లిని పిలవసాగింది. దీంతో శవపేటిక తెరవగా లోపల ఉన్న బాలిక సజీవంగా కనిపించింది.
ఇది కూడా చదవండి: ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)