Breaking News

16 ఏళ్లకే చదువుకు టాటా.. నేడు ఏటా రూ.100 కోట్లు సంపాదిస్తూ..

Published on Tue, 07/11/2023 - 11:21

ఫొటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి బిజినెస్‌ స్టార్ట్‌ చేసేందుకు తన కారును అమ్ముకోవాల్సివచ్చింది. అయినా అతను బాధపడలేదు. ఎందుకంటే తన కల నెరవేర్చుకునేందుకు కారు అ‍మ్మడం అతనికి తప్పనిసరి అయ్యింది. ఇప్పుడతను తన బిజినెస్‌ కారణంగా ఏటా 10 మిలియన్‌ పౌండ్లు(సుమారు రూ.103 కోట్లు) సంపాదిస్తున్నాడు. 

ఐటీ సొల్యూషన్‌ బిజినెస్‌ ప్రారంభించి..
బ్రిటన్‌కు చెందిన 40 ఏళ్ల రాబ్‌డెన్స్‌ జీసీఎస్‌సీ పూర్తి చేసిన తరువాత స్కూలుకు వెళ్లడం మానివేశాడు. బిజినెస్‌ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాడు. డైలీ స్టార్‌ రిపోర్టులో తెలిపిన వివరాల ప్రకారం తన తల్లిదండ్రుల గ్యారేజీలో ఐటీ సొల్యూషన్‌ బిజినెస్‌ ప్రారంభించాడు. ఇందుకోసం రాబ్‌డెన్స్‌ 2008లో తన కారును వెయ్యి పౌండ్లకు అమ్మేశాడు. ఇప్పుడతను పెద్ద ఐటీ కన్సల్టెన్సీ కంపెనీకి సీఈఓ. 

‘ఇన్నోవేటివ్‌గా ఉండేవాడిని’
ఈ కంపెనీలో వందమందికిపైగా సిబ్బంది ఉన్నారు. ఈ కంపెనీని నెలకొల్పి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రాబ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాబ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘నేను స్కూలు చదువులో ప్రతిభ చూపలేకపోయేవాడిని. అయితే ఇన్నోవేటివ్‌గా ఉండేవాడిని. ఏ పరికరం ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపేవాడిని. నేను వ్యాపారం ప్రారంభించినప్పుడు నాతో పాటు ఒకరు ఉండేవారు. అతను అడ్మిన్‌తోపాటు అకౌంట్స్‌ చూసుకునేవాడు. 18 నెలలకే మా సంస్థలో 10 మంది సిబ్బంది ఉండేవారు. కరోనా మహమ్మారి సమయంలోనూ మా వ్యాపారం అభివృద్ధిదాయకంగా ముందుకుసాగింది. ప్రస్తుతం మేము 10 మిలియన్‌ పౌండ్లకు పైగా బిజినెస్‌ చేస్తున్నాం. వ్యాపారరంగంలో మేము ఇంతలా రాణించిన నేపధ్యంలో పలు పురస్కారాలు అందుకున్నాం’ అని అన్నారు. 

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు