Breaking News

ఇంజనీర్‌తో బిల్‌గేట్స్‌ ఎఫైర్‌.. సత్య నాదెళ్ల స్పందన

Published on Tue, 05/25/2021 - 15:10

వాషింగ్టన్‌: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన నాటి నుంచి ఆయనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే ఆయన బోర్డు నుంచి వైదొలగాల్సి వచ్చిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. ఈ క్రమంలో ఈ విషయంపై మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తాజాగా స్పందించారు. అప్పటికి, ఇప్పటికి కంపెనీలో చాలా మార్పులు వచ్చాయన్నారు. 

సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల బిల్‌ గేట్స్‌ పేరు ప్రస్తావించకుండా ఈ అంశంపై స్పందించారు. ‘‘2000 సంవత్సరంతో పోలిస్తే కంపెనీలో పరిస్థితులు ఇప్పుడు చాలా భిన్నంగా ఉన్నాయి. చాలా మార్పులు సంభవించాయి. కంపెనీలో వైవిధ్యం, భిన్న సంస్కృతులు  ప్రతి రోజు అభివృద్ధి అయ్యే వాతావారణాన్ని మేం సృష్టించామని నేను భావిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశమని నేను భావిస్తున్నాను. దాని మీదనే ప్రత్యేకంగా దృష్టి సారించాను’’ అని తెలిపారు.

‘‘మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరి గురించి ఏవైనా ఆరోపణలను లేవనెత్తినప్పుడు అవతలి వారి కంఫర్ట్‌ గురించి కూడా ఆలోచించాలి. లేవనెత్తిన ఆరోపణలను పూర్తిగా దర్యాప్తు చేయగలిగేలా చూసుకోవాలి. అప్పటి వరకు మనకు తోచినవిధంగా ఊహించుకుని వారిని ఇబ్బంది పెట్టకూడదు" అని నాదెళ్ల తెలిపారు.

వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం.. ‘‘2000 సంవత్సరంలో బిల్‌గేట్స్‌.. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే మహిళా ఇంజనీర్‌తో లైంగిక సంబంధం పెట్టుకోవాలని భావించారు. సదరు మహిళ ఈ విషయం గురించి 2019లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బోర్డు..  చట్టబద్ధంగా ఆయనపై విచారణ జరిపించింది. బాధితురాలికి పూర్తి అండగా నిలబడింది’’ అని మైక్రోసాఫ్ట్‌ బోర్డు వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తు పూర్తికావడానికి ముందే బిల్‌గేట్స్‌ రాజీనామా చేశారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.

చదవండి: ఇంజనీర్‌తో ఎఫైర్‌: అందుకే బిల్‌ గేట్స్‌ రాజీనామా?!

Videos

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో బిగ్ అప్‌డేట్

జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేష్.. గంటా కొడుకు అత్యుత్సాహం

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం

పసి మనసులను చంపేస్తోన్న వివాహేతర సంబంధాలు

ఎల్లో మీడియా వేషాలు

కడప టీడీపీ నేతలకు బాబు మొండిచెయ్యి

ఎల్లో మీడియాకు మద్యం కిక్కు తగ్గేలా లేదు..

Analyst Vijay babu: వాళ్లకు ఇచ్చిపడేశాడు హ్యాట్సాఫ్ నారాయణ..

Photos

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)