Breaking News

ట్రంప్‌ గెలుపు... మహిళలకు ముప్పు: మిషెల్‌

Published on Sun, 10/27/2024 - 19:11

కలమజూ (మిషిగన్‌): అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిస్తే అమెరికా మహిళల జీవితాలు ప్రమాదంలో పడతాయని మాజీ ప్రథమ మహిళ మిషెల్‌ ఒబామా హెచ్చరించారు. దాన్ని నివారించాలంటే డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం మిషిగన్‌లో డెమొక్రాట్ల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. 

‘‘ఈ ఎన్నికల్లో ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోకపోతే మీ భార్య, మీ కూతురు, మీ తల్లి... ఇలా మహిళలుగా మేమంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని ఆమె హెచ్చరించారు. డెమొక్రటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌ తర్వాత పార్టీ ప్రచారంలో మిషెల్‌ పాల్గొనడం ఇదే తొలిసారి. హారిస్‌కు మద్దతుగా ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఆమె ప్రజల ప్రయోజనాలకోసమే పని చేస్తారన్నారు. 

ర్యాలీ అనంతరం మిషిగన్‌ గవర్నర్‌ గ్రెట్చెన్‌ విట్మర్‌తో కలిసి హారిస్‌ ట్రాక్‌ హౌజ్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌కు వెళ్లారు. స్థానికంగా తయారుచేసిన బీర్‌ తాగారు. స్థానికులతో పిచ్చాపాటీ మాట్లాడారు. యువతుల టేబుల్‌ వద్దకు రాగానే వారిలో ఒకరు హారిస్‌తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మిషిగన్‌లో ఇప్పటికే 20 శాతం మంది ముందస్తుగా ఓటేశారు. 

మహిళలకు అవకాశాలు: బైడెన్‌ 
హారిస్‌ గెలిస్తే అన్ని రంగాల్లోనూ మహిళలకు గతంలో కంటే ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. పిట్స్‌బర్గ్‌లోని లేబర్స్‌  ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికాలో ఆయన మాట్లాడారు.  కారి్మకులను ట్రంప బలహీనపరిచారని మండిపడ్డారు. కారి్మక ప్రయోజనాల కోసం ట్రంప్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. 

ఇదీ చదవండి: కమలాహారిస్‌కు గాయని బియాన్స్‌ మద్దతు 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)