Breaking News

ఒబామా దంపతులు విడిపోనున్నారా?

Published on Fri, 01/17/2025 - 05:45

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్, ఆయన భార్య మిచెల్‌ ఒబామా(60) తమ వివాహ బంధానికి ముగింపు పలకనున్నారా? సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బరాక్‌ ఒబామా ఒక్కరే హాజరురవుతారంటూ ఈ దంపతుల కార్యాలయం చేసిన ప్రకటనలే ఇందుకు బలం చేకూరుస్తోంది. అధికార కార్యక్రమానికి భర్త బరాక్‌ ఒబామాతో కలిసి మాజీ ప్రథమ మహిళ మిచెల్‌ గైర్హాజరవడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. 

ఇటీవల జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ నివాళి కార్యక్రమంలో సైతం మిచెల్‌ పాల్గొనలేదు. అమెరికా అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు సతీసమేతంగా పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, లారా బుష్‌ దంపతులు హాజరుకానున్నారు. 

కాగా, ఒబామా దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు కొన్ని నెలలుగా వార్తలు వెలువడుతున్నాయి. జిమ్మీ కార్టర్‌ నివాళి, ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అందుకు ఆజ్యం పోశాయి. సామాజిక మాధ్యమ వేదికల్లోనూ వీరు విడిపోయారంటూ రూమర్లు గుప్పుమంటున్నాయి. 1989లో డేటింగ్‌ ప్రారంభించిన బరాక్, మిచెల్‌లు 1992లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)