Breaking News

అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్‌ అవుట్‌?.. డెమోక్రటిక్‌ అభ్యర్థిగా ఆమె!

Published on Sat, 06/29/2024 - 14:54

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఆసక్తికర సమరం చోటు చేసుకోబోతోందా?. జో బైడెన్‌ స్థానంలో మరొకరిని డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా నిలపనుందా?. అమెరికా సెనేటర్‌ టెడ్‌ క్రూజ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు అక్కడ ఆసక్తికర చర్చకు దారి తీశాయి.

బరాక్‌ ఒబామా భార్య, అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా బరిలో నిలపాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు టెడ్‌ క్రూజ్‌ పేర్కొన్నారు. ఎన్నిక‌ల‌కు కేవ‌లం మూడు నెల‌ల ముందు ఆగ‌స్టులో జ‌రిగే డెమొక్రాటిక్ నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్‌లో బైడెన్‌ను మార్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

కాగా న‌వంబ‌ర్‌లో అమెరికా అధ్య‌క్షుడి కోసం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఎన్నికల బరిలో నిలిచిన‌ జో బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య జూన్ 27న జార్జియాలోని అట్లాంటాలో తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్ జ‌రిగింది. 90 నిమిషాల పాటు సాగిన ఈ డిబెట్‌లో ఇరువురు పలు కీలక అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేశారు. అయితే ఈ చ‌ర్చ‌లో బైడెన్ వెనుకంజవేశారని, ట్రంప్‌ పైచేయి సాధించారని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కొంతమంది వ్యూహకర్తలు బిడెన్‌ను భర్తీ చేసే మార్గాలపై చ‌ర్చిస్టున్న‌ట్లు తెలుస్తోంది.

బైడెన్ మాట్లాడిన తీరుపై డెమోక్రాట్లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న మాట్ల‌లో బొంగురు, స్ప‌ష్టంగా మాట్లాడ‌లేక‌పోవ‌డం, స‌మాధాన‌లు చెప్ప‌డంలో, ఆలోచ‌న‌ల‌ను వివ‌రించ‌డంలో త‌డ‌బాటు.. వంటి ప‌లు కార‌ణాల‌తో  బైడెన్‌ను రేసు నుంచి త‌ప్పించాల‌ని ఒత్తిడి వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది.  ఈ క్ర‌మంలోనే బిడెన్‌ను మిచెల్ ఒబామాతో డెమొక్రాటిక్ పార్టీ భర్తీ చేయాల‌ని చూస్తుంద‌ని చెప్పారు టెడ్‌ క్రూజ్‌. అధ్య‌క్ష రేసు నుంచి బైడెన్‌ను తొలగించి మిషెల్లీ ఒబామాను నియ‌మించే అవ‌కాశాలు 80 శాతం ఉన్న‌ట్లు తెలిపారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు