Breaking News

ఫ్రాన్స్‌ ప్రధానిగా మైకేల్‌ బార్నియర్‌

Published on Fri, 09/06/2024 - 05:44

పారిస్‌: ఫ్రాన్‌ నూతన ప్రధాని మైకేల్‌ బార్నియర్‌ను దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ గురువారం నియమించారు. బ్రెగ్జిట్‌ చర్చల్లో యూరోపియన్‌ యూనియన్‌కు 73 ఏళ్ల బార్నియర్‌ ప్రాతినిధ్యం వహించారు. హంగ్‌ పార్లమెంటు ఏర్పడటం వామపక్షాలు అతిపెద్ద గ్రూపుగా అవతరించడంతో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. 

ఎన్నికల్లో ఓటమితో గాబ్రియెల్‌ అట్టల్‌ జూలై 16న ప్రధానిగా రాజీనామా చేసినా ఒలింపిక్స్‌ క్రీడల దృష్ట్యా మాక్రాన్‌ ఆయన్నే తాత్కాలిక ప్రధానిగా కొనసాగించారు. లెఫ్ట్‌ కూటమి ఇదివరకు ఒకరిని ప్రధానిగా ప్రతిపాదించగా మాక్రాన్‌ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్లి ప్రభుత్వాన్ని నడపగల అభ్యర్థి కోసం మాక్రాన్‌ శిబిరం అన్వేíÙంచింది. చివరకు బార్నియర్‌ను ఎంపిక చేసింది. ‘దేశానికి, ఫ్రెంచ్‌ ప్రజలకు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను బార్నియర్‌కు అప్పగించాం’ అని మాక్రాన్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బార్నియర్‌ గతంలో ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రిగా, పర్యావరణ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. యూరోపియన్‌ యూనియన్‌ కమిషనర్‌గా రెండు పర్యాయాలు చేశారు.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)