Breaking News

Mexico: సూపర్ మార్కెట్‌లో పేలుడు.. 23 మంది మృతి

Published on Sun, 11/02/2025 - 12:03

మెక్సికో: ఉత్తర అమెరికాలోని మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక సూపర్ మార్కెట్‌లో జరిగిన పేలుడులో  23 మంది మృతిచెందగా, మరో 11 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. హెర్మోసిల్లోలోని వాల్డోస్ స్టోర్‌లో పేలుడు సంభవించింది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటనపై సోనోరా రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో డ్యూరాజో ఒక వీడియో సందేశంలో తాము చూసిన బాధితుల్లో చాలా మంది మైనర్లని తెలిపారు. పేలుడుకు గల కారణాన్ని గుర్తించేందుకు, బాధ్యులను పట్టుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర, భద్రత, ఆరోగ్య  సిబ్బంది నిబద్ధతతో స్పందించి, పరిస్థితిని నియంత్రించి, ప్రాణాలను కాపాడారని తెలిపారు. కాగా మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్  మృతులకు సంతాపం తెలిపారు.  ఈ  ఘటన గురించి తెలిసిన వెంటనే తాను సోనోరా గవర్నర్ అల్ఫోన్సో డురాజోతో సంప్రదింపులు జరిపానని,  సహాయక బృందాలను అప్రమత్తం చేయాలని కార్యదర్శి రోసా ఐసెలా రోడ్రిగ్జ్‌ను ఆదేశించానని తెలిపారు.
 

సూపర్‌ మార్కెట్‌లో పేలుడు జరిగిందా లేదా అనే దానిపై దర్యాప్తు జరుగుతోందని అగ్నిమాపక విభాగం చీఫ్ తెలిపారు. రాష్ట్ర అటార్నీ జనరల్ గుస్తావో సలాస్ మాట్లాడుతూ విషపూరిత వాయువులను పీల్చడం వల్ల మరణాలు సంభవించినట్లు తెలుస్తోందన్నారు. అయితే కొన్ని మీడియా నివేదికల్లో అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని పేర్కొన్నారు. పేలుడుకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్  కారణం కాగవచ్చని మెక్సికన్ అధికారులు భావిస్తున్నారు. కాగా సోనోరాలోని ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగివుండవచ్చని పేర్కొంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)