అమెరికాలో కలకలం.. బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన నౌక

Published on Sun, 05/18/2025 - 09:28

వాషింగ్టన్‌: న్యూయార్క్ నగరంలో నౌక ప్రమాదం కలకలం రేపింది. మెక్సికన్ నేవీకి చెందిన ఒక శిక్షణ నౌక ‘కువౌటెమోక్’ (Cuauhtemoc) బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  

ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల మేరకు.. ప్రయాణ సమయంలో కువౌటెమోక్‌ నౌకకు ఏర్పాటు చేసిన మూడు అడుగుల తెర భాగం బ్రిడ్జ్‌ను ఢీకొట్టింది. దీంతో నౌకకు ఏర్పాటు చేసిన తెరతోపాటు బ్రూక్లిన్‌ బ్రిడ్జ్‌ ధ్వంసమైన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

 మెక్సికోకు చెందిన ఈ నౌక సుమారు 297 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో ఉంది. శిక్షణ కోసం వినియోగించిన ఈ నౌక బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీ కొట్టడంతో ప్రయాణం ఆగిపోయింది.

 

ఈ నౌక ప్రతి సంవత్సరం శిక్షణ ముగిశాక ప్రపంచ పర్యటనలో భాగంగా పలు పోర్ట్‌లకు వెళ్లుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 6న మెక్సికోలోని అకపుల్కో పోర్ట్‌ నుంచి ప్రయాణం మొదలైంది. 277 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ నౌక 15 దేశాల్లోని 22 పోర్ట్‌లను సందర్శించాలని ప్రణాళిక వేసుకుంది. ఇందులో కింగ్‌స్టన్ (జమైకా), హవానా (క్యూబా), కోసుమెల్ (మెక్సికో), న్యూయార్క్ (అమెరికా), రేక్‌జావిక్ (ఐస్లాండ్), బోర్డో, సేంట్ మాలో, డంకిర్క్ (ఫ్రాన్స్), అబెర్డీన్ (స్కాట్లాండ్) ఉన్నాయి. మొత్తం 254 రోజుల ప్రయాణంలో 170 రోజులు సముద్రంలో గడపాల్సి ఉంది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)