మెస్సీ తండ్రి మృతి అంటూ తప్పుడు వార్త.. టీవీ యాంకర్ అవుట్!

Published on Sat, 06/20/2026 - 11:01

బ్యూనస్ ఎయిర్స్: లియోనెల్ మెస్సీ.. ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2026 పోటీల్లో అర్జెంటీనాను గెలిపించేందుకు ఆయన మైదానంలో చెమటోడుస్తుంటే, కొందరు బాధ్యతారహితంగా ప్రచారం చేసిన ఒక వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా  సంచలనం సృష్టించింది. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ మరణించారంటూ అర్జెంటీనాకు చెందిన ఒక ప్రముఖ మీడియా ఛానల్ లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో తప్పుడు వార్తను ప్రసారం చేసింది. ఈ తప్పిదంపై మెస్సీ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేయడంతో, సదరు ఛానల్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.

లైవ్ షోలో ఘోర తప్పిదం.. యాంకర్ అవుట్
అర్జెంటీనాలో 2020 నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ‘లూజు టీవీ’ (Luzu TV) న్యూస్ ఛానల్‌లో ఈ తప్పుడు వార్త ప్రసారమైంది. లైవ్ కార్యక్రమం నడుస్తుండగా, హోస్ట్ ఫ్లోరెన్సియా పెన్యా హఠాత్తుగా మెస్సీ తండ్రి కన్నుమూశారని ప్రకటించారు. అంతేకాకుండా, ఈ విషాదం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు మెస్సీ దూరం కానున్నాడంటూ కథనాన్ని అల్లేశారు. ఈ వార్త క్షణాల్లో వైరల్ కావడంతో మెస్సీ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

క్షమాపణలు చెప్పిన ఫ్లోరెన్సియా
ఈ ప్రచారంపై మెస్సీ కుటుంబం వెంటనే స్పందించి, అది పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పింది. జార్జ్ మెస్సీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని ఒక ప్రకటన విడుదల చేసింది. నిజం బయటకు రావడంతో టీవీ హోస్ట్ ఫ్లోరెన్సియా పెన్యా సోషల్ మీడియా వేదికగా మెస్సీ కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ప్రొడక్షన్ టీమ్ తనకు తప్పుడు సమాచారం ఇచ్చిందని చెబుతూనే, లైవ్‌లో ఆ వార్త చదివినందుకు బాధ్యత వహిస్తూ ఛానల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

వేటు వేసిన ఛానల్ యాజమాన్యం
ఈ ఘటనను లూజు టీవీ యాజమాన్యం చాలా సీరియస్‌గా తీసుకుంది. సరైన ధృవీకరణ లేకుండా ఇలాంటి సమాచారాన్ని ప్రసారం చేయడం క్షమించరాని నేరమని పేర్కొంది. దీనికి బాధ్యులైన హోస్ట్ ఫ్లోరెన్సియా పెన్యాతో పాటు, తప్పుడు సమాచారాన్ని అందించిన ప్రొడక్షన్ క్రూ సిబ్బంది మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బాధ్యతాయుతమైన జర్నలిజానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ఇటీవల అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ గోల్ కొట్టిన తర్వాత భావోద్వేగానికి గురికావడానికి కారణం ఫుట్‌బాల్ కాదు, ఈ కుటుంబ ఆరోగ్య సమస్యలేనని సమాచారం.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)