Breaking News

ట్రంప్‌పై దాడి చేసినవాడు రాక్షసుడు: మెలానియా

Published on Tue, 07/16/2024 - 12:27

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగిన అనంతరం అతని భార్య మెలానియా తన ఆవేదనను ఒక ప్రకటనలో తెలియజేశారు. పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో ఉండగా, థామస్ క్రూక్స్ అనే 20 ఏళ్ల షూటర్ కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ట్రంప్ చెవికి గాయమయ్యింది.

మెలానియా తన భావోద్వేగాలను ఒక ప్రకటనలో పంచుకుంటూ ట్రంప్‌ను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఈ ఘటనలో గాయపడినవారికి సానుభూతి ప్రకటించారు. ఆమె తన ప్రకటనలో.. ‘డొనాల్డ్  అభిరుచిని, నవ్వును, మాటల చాతుర్యాన్ని, సంగీతంపైగల ప్రేమను, అతని స్ఫూర్తిని నాశనం చేయడానికి ప్రయత్నించిన ఒక అమానవీయ రాజకీయ  ఘటన ఇది. ట్రంప్‌పై దాడి చేసినవాడు రాక్షసుడు. నా భర్త జీవితంలో నాకు నచ్చిన ప్రధాన అంశం అతని మానవతా దృక్పథం.

ఆయన ఉదారమైన వ్యక్తిత్వం కలిగినవాడు. మంచి, చెడు సమయాల్లో నేను అతని వెంట ఉన్నాను. ప్రేమకు భిన్నమైన అభిప్రాయాలు, విధానాలు, రాజకీయ ఆటలు హీనమైనవని మనం మరచిపోకూడదు. మా వ్యక్తిగత, నిర్మాణాత్మక  జీవిత కట్టుబాట్లు మా మరణం వరకు అలానే కొనసాగుతాయి. దేశంలో మార్పు పవనాలు వచ్చాయని అంటున్నారు. ఈ మాటకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు. రాజకీయ విభేదాలకు అతీతంగా స్పందిస్తున్నవారిని అభినందిస్తున్నాను’ అని మెలానియా పేర్కొన్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)