Breaking News

స్తంభించిన విద్యుత్‌.. మూడు దేశాలు అతలాకుతలం

Published on Mon, 04/28/2025 - 19:44

మాడ్రిడ్:  విద్యుత్ సప్లై పూర్తిగా నిలిచిపోవడంతో మూడు ఐరోపా దేశాలు అతలాకుతలమవుతున్నాయి. పవర్ గ్రిడ్ లో తీవ్రమైన సమస్యలు తలెత్తడంతో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌  దేశాలు పూర్తిగా స్తంభించిపోయాయి.

ప్రస్తుతం పవర్ గ్రిడ్ తిరిగి పునరుద్దరించే పనిలో పడ్డ మూడు దేశాలు.. సోమవారమంతా చీకటిలో మగ్గిపోయాయి. విమానాల రాకపోకల్లో తీవ్ర సమస్యలే కాకుండా భారీ ట్రాఫిక్ జామ్ లు వంటి ఘటనలు ఆ  దేశాల్లో తల్తెతాయి. దీనిపై  ఆయా దేశాలు అత్యవసరంగా క్యాబినెట్ భేటీ నిర్వహించి పవర్ గ్రిడ్ ను పునరుద్దరించేందుకు కసరత్తులు చేస్తున్నాయి.  

ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు..
చిమ్మ చీకటిలో గడుపుతున్న ఈ మూడు దేశాల్లో మెట్రో సేవలు ఉన్నపళంగా నిలిచిపోయాయి. . రైళ్లు కూడా ఎక్కడికక్కడి స్తంభించిపోయాయి. . దీంతో ఆయా దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభంపై ఇప్పటివరకూ ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.   మాడ్రిడ్ లోని నాలుగు టవర్ బిల్డింగ్ ల్లో ఒక దాన్ని ఖాళీ చేయించారు.  ఇందులో బ్రిటీష్ ఎంబాసీ పనిచేస్తున్న దరిమిలా  ఆ కార్యాలయాన్ని ఆకస్మింగా ఖాళీ చేయించారు.

ఆఫీసులు వదిలి.. రోడ్లపైనే
తీవ్రమైన విద్యుత్ సంక్షోభంతో కార్యాలయాలు ఏవీ పని చేయడం లేదు. ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులు.. రోడ్లపైనే తిరుగుతూ కాలయాపన చేస్తున్నారు. అయితే  దీనిపై స్పానిష్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఆపరేట్ రెడ్ ఎలక్ట్రికా స్పందించింది. విద్యుత్ ను తిరిగి పునరుద్దరించే క్రమంలో స్థానిక విద్యుత్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.  అన్ని యూరోపియన్ విద్యుత్ యూనియన్లను సమన్వయం చేసుకుంటూ  సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తాత్కాలిక ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)