Breaking News

నా జీవితంలో అదో ఘోర తప్పిదం : నా ఎఫైర్స్‌తో బెదిరించాడు : బిల్‌ గేట్స్‌

Published on Thu, 06/11/2026 - 15:13

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్‌, ప్రముఖ దాత బిల్ గేట్స్, దివంగత లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారంలో యూఎస్ కాంగ్రెస్ కమిటీ ముందు హాజరయ్యారు.తన జీవితంలో అతడిని కలవడం ఘోర తప్పిదమనీ, గ్లోబల్‌గా తన సేవలను ప్రమాదంలో పడేసిందంటూ సాక్ష్యమిచ్చారు. అంతేకాదు తన వివాహేతర సంబంధాల ఆదారంగా ఎప్‌స్టీన్ తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడంటూ సంచలన విషయాలను వెల్లడించారు.

అమెరికా పార్లమెంటరీ కమిటీ విచారణలో ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాలు, వారి సమావేశాల ఉద్దేశం, ఎప్‌స్టీన్‌ నేరపూరిత కార్యకలాపాల గురించి  ఏమైనా సమాచారం ఉందా అనే విషయాలపై చట్టసభ సభ్యులు గేట్స్‌ను ప్రశ్నించారు. చట్టసభ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ రహస్య విచారణలో బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ ఎప్‌స్టీన్‌తో పరిచయం తన ప్రతిష్టకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా తాను చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు దెబ్బతినే ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందన్నారు. అసలు ఆయన్ని కలవడం తాను చేసిన అతి పెద్ద తప్పిదమని బిల్ గేట్స్ అంగీకరించారు. నిజానికి అతని పరిచయం ప్రపంచ ఆరోగ్య, అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న సంపన్న దాతలను అనుసంధానించడంలో సహాయపడు తుందని తాన నమ్మానని గేట్స్ తెలిపారు. ఈ  ఉద్దేశంతోనే  2011 నుంచి 2014 మధ్య కొన్నిసార్లు  మీట్‌ అయ్యాననీ, అయితే ఆ చర్చల వల్ల ఎలాంటి ఫలితాలు రాలేదన్నారు.  దీంతో 2014 చివరి నాటికే వారి మధ్య చర్చలు, సంబంధాలు ముగిసిపోయాయని తెలిపారు. అంతేకాకుండా, తాను ఎలాంటి నేరపూరిత చర్యలలో పాలుపంచుకోలేదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. అలాగే ప్‌స్టీన్ ప్రైవేట్ దీవులు ప్రైవేట్ దీవి (ఐలాండ్), రాంచ్ లేదా ఫ్లోరిడాలోని నివాసాన్ని సందర్శించాననే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. 

మెలిందాతో వివాహ జీవితంపై బిల్ గేట్స్‌ను ఎప్‌స్టీన్ బ్లాక్‌మెయిల్ చేశాడా?
మరోవైపు బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు  ఈ విచారణలో వెలుగులోకి వచ్చాయి. తన వివాహ జీవితం వెలుపల ఉన్న సంబంధాల (Extramarital affairs) గురించి ఎప్‌స్టీన్‌కు తెలిసిందని, ఆ సమాచారాన్ని ఉపయోగించి తనతో సంబంధాలు కొనసాగించేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడని గేట్స్ అంగీకరించారు.  ఈ విషయాలను ఆసరాగా చేసుకుని లబ్ధి పొందాలని చూశాడన్నారు. ఇవి తన కుటుంబానికి బాధను కలిగించాయని చెప్పారు. తనతో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, తానెప్పుడూ సుముఖత చూపలేదని గేట్స్ పదే పదే నొక్కి చెప్పారు.

తమ మధ్య చర్చలు కేవలం స్వచ్ఛంద సేవ, నిధుల సేకరణ అవకాశాలపై మాత్రమే జరిగాయని గేట్స్ స్పష్టం చేశారు.  తాను ఆశించిన ఆర్థిక సహాయాన్ని ఎప్‌స్టీన్‌ అందించలేడని  అర్థమైన తర్వాత, అతనితో సంబంధాలను పూర్తిగా  కట్‌ చేసుకున్నట్లు గేట్స్ తెలిపారు.  ఎప్‌స్టీన్‌ నెట్‌వర్క్‌పై కాంగ్రెస్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతానికి, ఈ కేసులో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే డిమాండ్లు పెరుగుతుండటంతో, దర్యాప్తు అధికారులు మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే విచారణ కమిటీ ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, రిటైల్ దిగ్గజం లెస్లీ వెక్స్‌నర్‌తో సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులను కూడా విచారించింది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)