Breaking News

USA: ‘మాట’ నూతన కార్యవర్గం ఎన్నిక

Published on Fri, 02/14/2025 - 19:57

డల్లాస్‌: మాట (మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) బోర్డు మీటింగ్‌ డల్లాస్‌లో ఘనంగా జరిగింది. ఈ  కార్యక్రమంలో మాట 2025-26 పదవీకాలానికి నూతన  కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మాట అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దగి బాధ్యతలు స్వీకరించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రవీణ్ గూడూరు, సెక్రటరీగా  విజయ్ భాస్కర్ కలాల్, ట్రెజరర్‌గా  శ్రీధర్ గూడాల నియమితులయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు, శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, అడ్వైజరీ కౌన్సిల్ మెంబెర్ జితేందర్ రెడ్డి  తదితరులు ఈ సందర్భంగా కొత్త బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ బోర్డు మీటింగ్‌లో ఎగ్జిక్యూటివ్ కమిటీ, సలహా మండలి, బోర్డు, గౌరవ సలహాదారులు సహా 250 మందికి పైగా మాట ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఇప్పటివరకు చేసిన పలు కార్యక్రమాలతో పాటు భవిష్యత్‌ కార్యచరణపై  చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్ లక్ష్యాలను నూతన అధ్యక్షుడు వెల్లడించారు.

ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు ప్రజల కోసం సేవ, సంస్కృతి, సమానత్వం ప్రధాన సూత్రాలుగా మాట సంస్థ ఏర్పడిందని వివరించారు.  తెలుగు రాష్ట్రాల్లో మరింతగా మాట తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.  నూతనంగా ఎన్నికైన అడ్వైజరీ కౌన్సిల్ , న్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరక్టర్స్,  స్టాడింగ్ కమిటీ మెంబర్స్,  RVP’s, RC’s  గౌరవ సలహాదారులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)