Breaking News

tsunami: తీరానికి కొట్టుకొస్తున్న భారీ తిమింగలాలు

Published on Wed, 07/30/2025 - 12:03

టోక్యో: జపాన్‌ను సునామీ తాకింది. బుధవారం రష్యా తీరంలో 8.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కురిల్ దీవులు, జపాన్‌లోని హక్కైడో తీరప్రాంతాలలో సునామీకి కారణంగా నిలిచింది. అమెరికాలోని కాలిఫోర్నియా, అలాస్కా, హవాయి  న్యూజిలాండ్ వైపు ఉన్న ఇతర తీరాలకు కూడా  సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

జపాన్ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం తూర్పు తీరంలోని ఇషినోమాకి ఓడరేవును 50 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ తాకింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత పెద్దదయిన అల. పసిఫిక్ తీరం వెంబడి దక్షిణానికి, హక్కైడో నుండి టోక్యోకు, పలు ఈశాన్య ప్రాంతాలకు సునామీ కదులుతున్నప్పుడు 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఏర్పడ్డాయి. ఇటువంటి భారీ అలలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు.
 

భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత సునామీ తాకిడికి జపాన్ తీరం వెంబడి నాలుగు భారీ తిమింగలాలు కొట్టుకువచ్చాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. అలలు ముందుకు వెనుకకు కదులుతుండగా తీరం వెంబడి వస్తున్న తిమింగలాలకు సంబంధించిన వీడియోను బీఎన్‌ఓ న్యూస్ షేర్ చేసింది.

సునామీ అలలు సాధారణ అలల కంటే బలంగా ఉంటాయని, ఈ విధంగా వచ్చే 50 సెం.మీ. అల 200 కిలోల వరకు శక్తిని మోయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టోక్యో విశ్వవిద్యాలయ భూకంప శాస్త్రవేత్త సకాయ్ షినిచి మీడియాతో మాట్లాడుతూ గతంలో వచ్చిన శక్తివంతమైన భూకంపాల ఫలితంగా సంభవించిన సునామీలు జపాన్‌కు భారీ నష్టాన్ని కలిగించాయన్నారు. ఇప్పుడొచ్చిన భూకంపం 1952 నాటి భూకంపాన్ని పోలి ఉంని అన్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)