Breaking News

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Published on Mon, 12/08/2025 - 20:31

శక్తివంతమైన భూకంపం సోమవారం జపాన్‌ను వణికించింది. స్థానిక కాలమానం ప్రకారం.. రాత్రి 9.13గం. ప్రాంతంలో రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో(కొన్ని మీడియా సంస్థలు 7.2గా ఇస్తున్నాయ్‌) భూమి కంపించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 

భూకంప కేంద్రం హొక్కైడో(జపాన్‌లో రెండవ అతిపెద్ద దీవి) తీరానికి సమీపంలో ఆవోమోరి నగరానికి సమీపంలో.. సముద్ర మట్టానికి సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. భూకంపం ప్రభావంతో.. సముద్రంలో 10 అడుగుల ఎత్తులో అలల ఎగసి పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

జపాన్ ఉత్తర తీరంలో సంభవించిన ఈ భూకంపం వల్ల ప్రజలకు సునామీ ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల నేపథ్యంతో ఆ ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాలు భద్రతా తనిఖీలు ప్రారంభించాయని NHK (జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్) తెలిపింది. 

భూకంపాలతో అత్యంత ప్రభావితమయ్యే దేశాల్లో జపాన్‌ ఒకటి. పసిఫిక్, యూరేషియన్, ఫిలిప్పైన్ టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ తరచుగా శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తాయి. గతంలో.. గ్రేట్ కాంటో (1923), కోబే (1995), టోహోకు (2011) అత్యంత ప్రభావవంతమైనవి. ఇవి దేశానికి పెద్ద నష్టం కలిగించాయి

జపాన్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 7.0 కంటే ఎక్కువ తీవ్రత గల భూకంపాలు 1900–2016 మధ్య 163 సార్లు నమోదయ్యాయి. అలాగే.. 8.0 కంటే ఎక్కువ తీవ్రత భూకంపాలు 14 సార్లు సంభవించాయి. టోహోకు భూకంపం (2011).. 9.0 తీవ్రతతో జపాన్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన భూకంపంగా నిలిచింది. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం కూడా జరిగింది.భారీ సునామీ కారణంగా 15,000 మందికి పైగా మరణించారు. ఈ ఏడాది జనవరిలో హ్యుగా-నాడా భూకంపం ..  6.9 తీవ్రతతో మియాజాకి ప్రిఫెక్చర్ సమీపంలో సంభవించలేదు. అయితే పెద్ద నష్టం జరగలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)