Breaking News

వింత శబ్దాల మిస్టరీ వీడింది

Published on Sat, 09/14/2024 - 09:58

సరిగ్గా ఏడాది క్రితం ఆర్కిటిక్‌ నుంచి అంటార్కిటికా దాకా ప్రపంచమంతటా 9 రోజులపాటు తరచుగా వినిపించిన వింత శబ్దాల రహస్యం వీడిపోయింది. ఈ శబ్దాలకు భూప్రకంపనలు కారణం కాదని పరిశోధకులు తేల్చారు. గ్రీన్‌లాండ్‌లోని మారుమూల ప్రాంతం డిక్సన్‌ ఫోర్డ్‌లో భారీగా మంచు చరియలు విరిగిపడడం వల్ల భూమి స్వల్పంగా కంపించడంతో ఉత్పత్తి అయిన శబ్దాలుగా గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు. భూకంపాలను అధ్యయనం చేసే పరిశోధకులు 2023 సెపె్టంబర్‌లో రహస్య శబ్ద సంకేతాలను గుర్తించారు. గతంలో ఇలాంటి సంకేతాలు ఎన్నడూ కనిపెట్టలేదు. ఇవి సాధారణ భూప్రకంపనల్లాంటివి కాకపోవడంతో వారిలో ఆసక్తి పెరిగింది. ఒకే వైబ్రేషన్‌ ప్రీక్వెన్సీతో శబ్దాలు వినిపించాయి. 

దీనిపై అధ్యయనం కొనసాగించి, గుట్టు విప్పారు. డిక్సన్‌ ఫోర్డ్‌లో మంచు కొండల నుంచి విరిగిపడిన మంచు, రాళ్లతో 10 వేల ఒలింపిక్‌ ఈత కొలనులు నింపవచ్చని తెలిపారు. మంచు చరియల వల్ల మెగా సునామీ సంభవించి, సముద్రంలో 200 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడ్డాయని చెప్పారు. లండన్‌లోని బిగ్‌ బెన్‌ గడియారం కంటే రెండు రెట్ల ఎత్తుకు అలలు ఎగిశాయని వెల్లడించారు. భారీ అలల ప్రభావం ఏకంగా 9 రోజులపాటు కొనసాగిందని అన్నారు. దీనికారణంగానే వింత శబ్దాలు వినిపించినట్లు స్పష్టంచేశారు. 

గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గ్రీన్‌లాండ్‌లో మంచు కరుగుతోంది. సముద్రంలో దశాబ్దాలపాటు స్థిరంగా నిలిచి ఉన్న భారీ మంచు పర్వతాలు సైతం చిక్కిపోతున్నాయి. అవి బలహీనపడి, మంచు ముక్కలు జారిపడుతున్నాయి. వాతావరణ మార్పులు, భూతాపం వల్ల హిమానీనదాలు గత కొన్ని దశాబ్దాల్లో పదుల మీటర్ల పరిమాణంలో చిక్కిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూ ధ్రువ ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడడం, సునామీలు ఇక సాధారణ అంశంగా మారిపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. భూగోళం వేడెక్కడం ఇంకా కొనసాగితే అవాంఛనీయ పరిణామాలు సంభవించడం తథ్యమని పేర్కొన్నారు.  
    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)