Breaking News

ఎయిర్‌పోర్టు వెలుపల పేలుడు.. ఇద్దరు మృతి

Published on Mon, 10/07/2024 - 06:54

కరాచీ: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ భారీ పేలుడులో ఇద్దరు  మృతిచెందారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలింది.

విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పాక్‌ హోం మంత్రి జియా ఉల్ హసన్ స్థానిక టీవీ ఛానల్ జియోకు తెలిపారు. చైనా పౌరులపై దాడి జరిగిందని, వారిలో ఒకరు గాయపడ్డారని అన్నారు.  బీజింగ్ చేపట్టిన రహదారి నిర్మాణంలో చైనా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ రహదారి దక్షిణ-మధ్య ఆసియాను చైనా రాజధాని బీజింగ్‌తో కలుపుతుంది.

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఈస్ట్ అజ్ఫర్ మహేసర్ మీడియాతో మాట్లాడుతూ తాము పేలుడుకు గల కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నామన్నారు. గాయపడిన వారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. హోం మంత్రి, ఇన్‌స్పెక్టర్ జనరల్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎయిర్‌పోర్టు భవనాలు కంపించేంత పెద్ద పేలుడు సంభవించిందని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న అధికారి రాహత్ హుస్సేన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: అశ్వియ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)