గ్రాండ్‌ ఓల్డ్‌ లేడీ ఇక లేదు

Published on Wed, 08/21/2024 - 11:10

మాడ్రిడ్‌: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న 117 ఏళ్ల బామ్మ ఇకలేరు. అమెరికాలో జన్మించిన, స్పెయిన్‌ దేశస్తురాలు మరియా బ్రన్యాస్‌ కన్నుమూశారని ఆమె కుటుంబసభ్యులు మంగళవారం ప్రకటించారు. బ్రన్యాస్‌ ‘ఎక్స్‌’పేజీలో వారు..‘మరియా బ్రన్యాస్‌ మనల్ని విడిచి వెళ్లిపోయారు. 

కోరుకున్న విధంగానే నిద్రలోనే, ప్రశాంతంగా, ఎలాంటి బాధా లేకుండా తుదిశ్వాస విడిచారు’అని పేర్కొన్నారు. 110, అంతకంటే ఎక్కువ ఏళ్లు జీవించి ఉన్న వ్యక్తుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించే గెరంటాలజీ రీసెర్చ్‌ గ్రూప్‌.. ఫ్రాన్సుకు చెందిన లుసిలె రాండన్‌ అనే నన్‌ గతేడాది మరణించాక, మనకు తెలిసినంత వరకు అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్‌ అని ప్రకటించింది. 

బ్రన్యాస్‌ మరణంతో ఆ స్థానం 116 ఏళ్ల జపనీయురాలు తొమికొ ఇకూటాకు దక్కుతుందని తాజాగా ఆ గ్రూప్‌ తెలిపింది. 1907 మార్చి 4వ తేదీన అమెరికాలో శాన్‌ ఫ్రాన్సిస్కోలో బ్రన్యాస్‌ జని్మంచారు. ఆమె కుటుంబం కొన్నాళ్లపాటు న్యూఆర్లియన్స్‌లోనూ ఉంది. ఆమె తండ్రి స్పెయిన్‌లో ఓ మ్యాగజీన్‌ను ప్రారంభించడంతో, కుటుంబంతోపాటు ఆమె కూడా ఇక్కడికే వచ్చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో అట్లాంటిక్‌ సముద్రం మీదుగా స్పెయిన్‌కు జరిగిన అప్పటి ప్రయాణం తనకు గుర్తుందని చెప్పేవారు బ్రన్యాస్‌. ‘ఎక్స్‌’లోని సూపర్‌ కాటలాన్‌ గ్రాండ్‌మా అనే పేజీలో బ్రన్యాస్‌..‘నేను వృద్ధురాలిని. అత్యంత వృద్ధురాలిని. మూర్ఖురాలిని మాత్రం కాదు’అని పెట్టుకున్నారు. 

113 ఏళ్ల వయస్సులో తక్కువ తీవ్రతతో సోకిన కోవిడ్‌ నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. కాటలాన్‌ ప్రాంతంలోని ఒలోట్‌ పట్టణంలోని ఓ నర్సింగ్‌ హోంలో ఆమె కన్నుమూశారు. ‘ఎప్పుడో తెలియదు కానీ, ఈ సుదీర్ఘ ప్రయాణం త్వరలోనే ముగుస్తుంది. ఇంత దీర్ఘకాలం జీవించి శిథిలమైన స్థితిలో ఉన్న నన్ను మరణం ఆవహిస్తుంది. నవ్వుతూ మరణాన్ని ఆహ్వానిస్తాను. స్వేచ్ఛగా, సంతృప్తికరంగా జీవితం ముగించాలనుకుంటున్నాను’అని కొన్ని రోజుల క్రితం బ్రన్యాస్‌ తమతో అన్నారని కుటుంబసభ్యులు తెలిపారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)