Breaking News

కాలువపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించండి 

Published on Tue, 02/04/2025 - 05:26

వాషింగ్టన్‌: పనామా కాలువపై చైనా ఆధిపత్యం, నియంత్రణను తగ్గించడానికి అత్యవసర మార్పులు చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పనామా దేశాన్ని హెచ్చరించారు. ఆదివారం పనామాలో పర్యటించిన రూబియో.. పనామా దేశాధక్షుడు జోస్‌ రౌల్‌ ములినోతో భేటీ అయ్యారు. కాలువపై యథాతథ స్థితి ఆమోదయోగ్యం కాదని, తక్షణ మార్పులు లేకపోతే, ఒప్పందం ప్రకారం తన హక్కులను రక్షించడానికి అమెరికా అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అయితే అమెరికా బెదిరింపులకు తాము భయపడబోమని ములినో స్పష్టం చేశారు. 

చైనా ఆధిపత్యం గురించి అమెరికా ఆందోళనలను పోగొట్టేందుకు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూబియో పర్యటన వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడం వంటి ఉమ్మడి ఆసక్తులపై దృష్టి పెడుతుందని ములినో ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనామా అధ్యక్షుడు జోస్‌ రౌల్‌ ములినో ప్రకటించారు. 

ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో ములినో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం  గమనార్హం. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌లో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని ఆయన తెలిపారు. ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక అక్రమ వలసదారుల ఏరివేతకు సహకారాన్ని పెంచుతామని ములినో హామీ ఇచ్చారు. రూబియో పర్యటనకు ముందు పనామాలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు ట్రంప్, రూబియో దిష్టి»ొమ్మలను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)