Breaking News

హిట్లర్‌ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు?

Published on Sat, 09/30/2023 - 12:49

ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంతగా అడాల్ఫ్ హిట్లర్ పేరుగాంచాడు. హిట్లర్‌ అనేక దేశాలలో విధ్వంసం సృష్టించాడు. లక్షలాది మందిని పొట్టనపెట్టుకున్నాడు. హిట్లర్ నియంతృత్వం ఎంతగా పెరిగిందంటే అతని కారణంగా ఒక దేశంతో మరో దేశం పోరాడేందుకు సిద్ధం అయ్యింది. అలాంటి హిట్లర్ చొరవతోనే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు మనం హిట్లర్‌ జీవితంలోని ఒక రహస్యం గురించి తెలుసుకుందాం. 

ప్రపంచమంతా హిట్లర్ నియంతృత్వానికి ఆందోళన చెందింది. ఈ నేపధ్యంలోనే అతన్ని చంపడానికి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. ఎవరికీ ఇది అంత సులభం కాలేదు. హిట్లర్‌ను వెన్నంటి ఉండే నాజీ సైన్యం అతనిని అనుక్షణం కంటికిరెప్పలా కాపాడేది. ఆహారంలో విషం కలిపి, తనను ఎవరైనా చంపేస్తారేమోనని హిట్లర్‌ నిత్యం భయపడేవాడు. దీనిని తప్పించుకునేందుకు ఒక మార్గాన్ని కూడా అనుసరించాడు. 

హిట్లర్‌కు సన్నిహితులైన 15 మంది మహిళలు ఆయనకు వడ్డించే ఆహారాన్ని మొదట రుచి చూసేవారు. ఎప్పుడైనా ఆహారంలో విషం కలిపితే, దానిని రుచి చూసే మహిళ చనిపోతుంది. అప్పుడు హిట్లర్ ప్రాణాలకు రక్షణ ఏర్పడుతుంది. హిట్లర్ ఆహారం తీసుకునే ప్రతిసారీ ఈ మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు. హిట్లర్‌ తినే ఆహార పదార్థాలు అధికంగా ఉండటం వలన వాటిని పలువురు మహిళలు రుచి చూసేవారు. 

హిట్లర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పలు పద్ధతులను ఉపయోగించేవాడు. ఎటువంటి దాడికి గురికాని సైనిక బంకర్లలో తల దాచుకునేవాడు. భారీ స్థాయిలో ఉన్న నాజీ సైన్యం అతనిని నిరంతరం కాపాడుతుండేది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంతలా తాపత్రయపడిన హిట్లర్ చివరికి విషాహారం కారణంగానే మృతి చెందాడు.
ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)