Breaking News

Nigeria: పడవ ప్రమాదం.. 100 మంది గల్లంతు

Published on Sat, 11/30/2024 - 06:58

అబుజా: ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మంది గల్లంతైనట్లు  అధికారులు తెలిపారు. పడవ ఎందుకు మునిగిపోయిందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పడవలో వ్యాపారులు 
నేషనల్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ (ఎన్‌ఐడబ్ల్యూఏ)ప్రతినిధి మకామా సులేమాన్ మీడియాతో మాట్లాడుతూ పడవలో ప్రధానంగా మధ్య కోగి రాష్ట్రంలోని మిసా కమ్యూనిటీకి చెందిన వ్యాపారులు ఉన్నారన్నారు. వీరు పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని వీక్లీ మార్కెట్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అయితే మృతుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదని సులేమాన్ తెలిపారు. ప్రయాణికులెవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం కారణంగానే ప్రాణనష్టం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.

తరచూ ప్రమాదాలు
ఘటనా స్థలంలో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. బోటులో ఎక్కువగా మహిళలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. బోటులో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. ఓవర్‌లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కార్యాచరణ లోపాలు తదితర అంశాలు  ఇటువంటి ఘటనలకు కారణంగా నిలుస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: చైనాలో జర్నలిస్ట్‌పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)