Breaking News

బైక్ ప్రమాదాల్లో 9 మందికి గాయాలు.. ఎక్కడంటే?

Published on Sat, 01/10/2026 - 03:12

ఎడారి ఇసుక దీవుల్లో బైక్ రైడింగ్‌ చేయడమంటే అందరికీ సరదానే. కానీ అదే సరదా ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవల అబుదాబి ఎడారి ఇసుక దిబ్బలలో బైక్ నడుపుతుండగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు 9 మంది గాయపడ్డారు. గత గురువారం ఒక్కరోజే ఏడు వేర్వేరు ప్రమాదాల్లో బైక్ రైడింగ్ చేస్తున్న వ్యక్తులు గాయపడ్డారని అబుదాబి పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మితిమీరిన వేగం, భద్రతా నియమాలను పాటించకపోవడం వల్లే ప్రమాదాలు సంభవించాయని పోలీసులు నిర్ధారించారు.

ఎడారిలో బైక్‌ రైడింగ్‌కు వెళ్లే పిల్లలతో తల్లిదండ్రులు తప్పనిసరిగా వెళ్లాలని  పోలీసు అధికారులు ఆదేశించారు. జనావాసాలు లేని ఇసుక ప్రాంతాలలో పిల్లలు నిర్లక్ష్యంగా బైక్‌లు నడపకుండా నిరోధించడానికి తల్లిదండ్రుల సహకారం చాలా అవసరమన్నారు. హెల్మెట్‌ లేకపోవడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయని అధికారులు హెచ్చరించారు.

ఎడారిలో రహదారి నియమాలు అందరికీ సమానంగా వర్తిస్తాయని ట్రాఫిక్, పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రదర్ మహమూద్ యూసఫ్ అల్ బలూషి అన్నారు. బైక్ రైడర్లు హెల్మెట్, తగిన భద్రతా దుస్తులను ధరించాలని కోరారు. బయలుదేరే ముందు బైక్  టైర్లు, లైట్లు పని చేస్తున్నాయో లేదో  నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రథమ చికిత్స వస్తు సామగ్రి,అనుమతి కలిగిన భద్రతా పరికరాలను తీసుకెళ్లడం చాలా అవసరమని తెలిపారు.  రద్దీగా ఉండే ప్రాంతాలలో వేగాన్ని తగ్గించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ సూచించిన లేన్‌లలో మాత్రమే ప్రయాణించాలని వాహనదారులకు గుర్తు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని పట్టుకోవడానికి పోలీసులు అంతర్గత రోడ్లు, హైవేలపై నిఘాను కఠినతరం చేశామని హెచ్చరించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)