Breaking News

Istanbul: భారీ అగ్ని ప్రమాదం.. 29 మంది మృతి

Published on Tue, 04/02/2024 - 21:18

టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బెసిక్తాస్‌ డిస్ట్రిక్ట్‌లోని గైరెట్టెప్‌లోని 16 అంతస్తుల భవనంలో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పునర్నిర్మాణంలో ఉన్న మాస్వ్కెరేడ్ నైట్ క్లబ్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన ప్రదేశానికి చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలను అర్పివేశారు.

బెసిక్తాస్‌ జిల్లాలోని గైరెట్టెప్‌లో అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 29కి చేరిందని నగర గవర్నర్ దావత్‌ గుల్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నం 12. 47 నిమిషాలకు భవనంలో మంటలు ప్రారంభించినట్లు పేర్కొంది. అయితే అగ్ని మాపక సిబ్బంది కొన్ని గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. 

ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. భవనంలోని అంతస్తుల కిటికీల నుంచి భారీగా మంటలు, దటమైన పొగ కమ్ముకున్నట్లు వీడియోల్లో కనిపిస్తుంది. అయితే భవనంలోని మొదటి, రెండో అంతస్తులలో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగినట్లు గవర్నర్‌ దావత్‌ గుల్‌ అన్నారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు  మంత్రి అలీ యోర్లికాయ తెలిపారు.  క్లబ్ యజమానితోపాటు మరో ఐదుగురిని  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)