Breaking News

అమెరికాలో టోర్నడో విధ్వంసం.. అయిదుగురి మృతి

Published on Sat, 06/17/2023 - 08:54

అమెరికాలో టోర్నడో తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. టెక్సాస్‌ రాష్ట్రంలోని పాన్‌హ్యాండిల్‌ పట్టణం పెర్రిటన్‌లో టోర్నడో ధాటికి అయిదుగురు మృతి చెందారు. దాదాపు 100 మంది స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మృతుల్లో 11 బాలుడు, 60 ఏళ్ల వయస్సున ఇద్దరు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. అక్కడి కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత టోర్నడో తుపాను టెక్సాస్‌, ఫ్లోరిడా ప్రాంతాన్ని తాకినట్లు అమరిల్లోలోని నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ పేర్కొంది.

సమాచారం అందుకున్న అత్యవసర సేవల అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌ సేవలు ముమ్మరంగా సాగుతున్నాయని పెర్రిటన్ ఫైర్ చీఫ్ పాల్ డచర్ తెలిపారు. సుడిగాలి కారణంగా టెక్సాస్‌లో 200 ఇళ్లు ధ్వంసమవ్వగా.. మొబైల్ హోమ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. దీంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ వృక్షాలు నెలకొరిగాయి. వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

టెక్సాస్‌, లూసియానా, మిస్సిస్సిప్పి, ఫ్లోరిడా, ఓక్లహోమాలో సుమారు 50 వేల గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో మగ్గుతున్నారు. పెర్రిటన్‌లో ముగ్గురు వ్యక్తులు మరణించారని, పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. సుడిగాలి తీవ్రతకు గురువారం ఫ్లోరిడా పాన్‌హ్యండిల్‌లో ఇంటిపై చెట్టు కూలడంతో ఒకరు మరణించారని తెలిపింది.
చదవండి: ఐరాసలో యోగా వైట్‌హౌస్‌లో విందు

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)