Breaking News

ఈయనకు ఆకలి ఉంది.. నిద్రే కరువైంది!

Published on Tue, 01/23/2024 - 10:21

ఒక్కరోజు నిద్రకు దూరమైతే చాలు.. మర్నాడు మనం ముఖం వేలాడేసుకుని, నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. మరి 60 ఏళ్లకుపైబడి నిద్రకు దూరమైన వ్యక్తి గురించి తెలిస్తే ఏమంటారు? 

థాయ్ అంజోక్.. ప్రపంచంలో 62 ఏళ్లకు పైగా నిద్రపోని వ్యక్తి. వియత్నాంకు చెందిన ఈ మహాశయుడు తనకు 62 ఏళ్లుగా నిద్ర పట్టడం లేదని మీడియాకు తెలియజేశాడు. 1962 నుంచి తన జీవితం నుంచి నిద్ర అనేది శాశ్వతంగా మాయమైందని థాయ్ అంజోక్ తెలిపాడు. ఆయన నిద్రపోవడాన్ని అయన భార్యాపిల్లలు ఎన్నడూ చూడలేదట. ప్రముఖ యూట్యూబర్ డ్రూ బిన్స్కీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో థాయ్ అంజోక్ తన కథను వివరంగా చెప్పాడు. దీనికి ముందు కూడా థాయ్ అంజోక్ నిద్రలేమి కథలు పలు మీడియా నివేదికలలో కనిపించాయి.

80 ఏళ్లుదాటిన థాయ్ అంజోక్‌కు 1962లో ఒక రోజు రాత్రి జ్వరం వచ్చిందట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోలేనని అంజోక్‌ చెప్పాడు. అయితే అంజోక్‌కు హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట. వైద్య నిపుణులు ఈ రకమైన వ్యాధిని నిద్రలేమి అని చెబుతారు. దీని కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే నిద్రలేమి అనేది  థాయ్ అంజోక్‌ ఆరోగ్యంపై ఏమాత్రం ‍ప్రభావం చూపకపోవడం వైద్యశాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

థాయ్ అంజోక్‌ ఈ వయసులోనూ పొలంలో పనిచేస్తుంటాడు. థాయ్ అంజోక్‌కు గ్రీన్ టీ, రైస్ వైన్ అంటే ఇష్టం. తాను రోజూ కళ్ళు మూసుకుని నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని థాయ్ అంజోక్‌ తెలిపాడు. వేలాది రోజుల పాటు నిద్రకు దూరమైన థాయ్ అంజోక్‌ ఒక దేశీ మద్యం తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాత్రి మూడు గంటల వరకు డ్యూటీలో  ఉంటాడు. విదేశాల నుంచి పలువురు వైద్య శాస్త్రవేత్తలు తనను పరీక్షించేందుకు వస్తుంటారని ఆయన తెలిపాడు. 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)