Breaking News

ఇదేం విచిత్రమైన పోటీ.. గిన్నిస్ రికార్డు కూడానా?  

Published on Sat, 07/01/2023 - 18:27

ఫ్రాన్స్: ఒక విచిత్రమైన పోటీలో పాల్గొని ప్రపంచ రికార్డు బద్దలుకొట్టాడు ఫ్రాన్స్ కు చెందిన జోనాథన్ వెరో అనే స్టంట్ మ్యాన్. ఆక్సిజన్ తీసుకునే అవకాశం లేకుండా ఒంటికి నిప్పంటించుకుని 100 మీటర్ల పరుగు పందాన్ని 17 సెకండ్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డుతో పాటు గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.  

ఫ్రాన్స్ కు చెందిన జోనాథన్ వెరో అనే 39 ఏళ్ల స్టంట్ మాస్టర్ కు చిన్నప్పటి నుండి స్టంట్స్ అంటే చాలా ఇష్టమట. అందులోనూ నిప్పుతో చెలగాటమాడటం అంటే అతడికి మహా సరదా. నిప్పును నోట్లో వేసుకుని విన్యాసాలు చేయడం వంటి ఎన్నో సాహసాలు చేయడం అతడికి అలవాటు. 

అందులో భాగంగానే ఒళ్ళంతా నిప్పు అంటించుకుని కాలుతూ పరిగెత్తడంలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మంటల్లో మండుతూ 272.25 మీటర్లు పరిగెత్తి కాలుతూ ఆక్సిజన్ తీసుకోకుండా ఎక్కువ దూరం పరిగెత్తిన రికార్డుతో పాటు 17 సెకండ్లలో 100 మీటర్లు పూర్తి చేసి పాత రికార్డును చెరిపేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 

కేవలం ప్రపంచ రికార్డు మాత్రమే కాదు ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు జోనథన్. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ స్వయంగా గిన్నిస్ బుక్ ప్రతినిధులే వీడియోతో సహా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ వీడియోకు   మిలియన్లలో వీక్షణలు దక్కాయి. నెటిజన్లు ఈ వీడియోకు ఇలాంటి చెత్త రికార్డులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.   

ఇది కూడా చదవండి: ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..?    

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)