Breaking News

ఛీ! విమానంలో అదేం పని...ఏడాది జైలు శిక్ష

Published on Sat, 11/05/2022 - 16:57

విమానంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌కి చెందిన 72 ఏళ్ల జేమ్స్‌ హ్యూస్‌ అనే వ్యక్తి బాలి నుంచి బ్రిస్బేన్‌కి విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు విమానం బ్రిస్బేన్‌ ఎయిర్‌పోర్ట్‌కి సమీపిస్తున్న సమయంలో  సదరు వ్యక్తి సీటులో బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమానానికి సుమారు ఆరుగంటల పాటు అంతరాయం ఏర్పడింది.

ఈ మేరకు ఆస్ట్రేలియన్‌ ఫెడరల్‌ పోలీసులు(ఏఎఫ్‌పీ) అతన్ని అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ అతను తన నేరాన్ని అంగీకరించాడు. విచారణలో అతను కొద్దిమొత్తంలో వైన్‌ సేవించినట్లు తేలిందని బ్రిస్బన్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ కమాండర్‌ మార్క్‌ కోల్‌బ్రాన్‌ కోర్టుకి తెలిపారు. అంతేగాక అతను ఉద్దేశపూర్వకంగానే అసభ్యంగా ప్రవర్తించాడని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

ఎయిర్‌పోర్ట్‌ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని అన్నారు. దీంతో బ్రిస్బేన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు అతనిపై క్రమశిక్షణా చర్యలు నిమిత్తం సుమారు 12 నెలలు జైలు శిక్ష విధించింది. అంతగాదు పలువురు ప్రయాణికులు విమానంలో సురక్షితంగా ప్రయాణించాల్సి ఉంది కాబట్టి మద్యం సేవించినప్పుడూ కాస్త బాధ్యతగా వ్యవహరించమని ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌ బ్రిస్బేన్‌ ఎయిర్‌పోర్ట్‌ విజ్ఞప్తి చేసింది. 

(చదవండి: గిన్నిస్‌ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!)

Videos

PM Modi: వచ్చేది వినాశనమే పాక్ కు నిద్ర పట్టనివ్వను

YSRCP మహిళా విభాగం రాష్ట్రస్థాయి సమావేశం

పాక్ కు కోలుకోలేని దెబ్బ, బలోచిస్తాన్‌కు భారత్ సపోర్ట్ ?

Ambati: అర్ధరాత్రి ఒక మహిళపై పోలీసులే దాడి.. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?

YS Jagan: వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం

మురళీ ఎక్కడ ఉన్నావ్.. జగన్ సార్ వచ్చాడు సెల్యూట్ చెయ్

మురళీ నాయక్ కుటుంబానికి జగన్ ఆర్థిక సాయం..

Jawan Murali Naik Family: వైఎస్ జగన్ పరామర్శ

ఆపరేషన్ సిందూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని హర్షం

శ్రీకాకుళం జిల్లా కొరాఠి ఫీల్డ్ అసిస్టెంట్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు

Photos

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?

+5

విజయవాడ : అన్నమాచార్యులు జయంతి సందర్భంగా.. నృత్య సమ్మోహనం (ఫొటోలు)

+5

Miss World 2025: నాగార్జున సాగర్‌ బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

పెళ్లయి 13 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ స్నేహ ఇలా (ఫొటోలు)