Breaking News

ఎరక్కపోయి ఇరుక్కున్నాడు

Published on Sat, 12/14/2024 - 06:19

నిషేధిత డ్రగ్స్‌ కలిగి ఉన్నాడన్న కారణంతో అతని ఇంటిని సోదాచేయడానికి పోలీసుల బృందం రంగంలోకి దిగగా పారిపోయేందుకు సిద్ధపడ్డ ప్రబుద్ధుడు ఎవరికీ అనుమానం రావొద్దని చిమ్నీలో దాక్కోబోయాడు. అందులో ఇరుక్కుపోయి చివరకు సాయం కోసం బిగ్గరగా అరచి తన జాడ తానే పోలీసులకు చెప్పేశాడు. 

అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రంలోని రివర్‌ ఫాల్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం 33 ఏళ్ల రాబర్ట్‌ లాంగ్లేస్‌ వద్ద నిషేధిత డ్రగ్స్‌ ఉన్నాయని తెల్సి మంగళవారం పోలీసులు సెర్చ్‌ వారెంట్‌తో రాబర్ట్‌ ఇంటికొచ్చారు. అరెస్ట్‌ చేద్దామని ఇళ్లంతా వెతికినా రాబర్ట్‌ దొరకలేదు. అయితే ఇదే సమయంలో ఇంటి వెనుక ఎవరో సాయం కోసం అరుస్తున్న శబ్దం వస్తోందని అటుగా దారిన పోయే వ్యక్తులు చెప్పారు. 

దీంతో పోలీసులు ఇంటిపైకప్పు మీదకొచ్చి చూస్తే ఎవరూ లేరు. ఒకాయన చిమ్నీ గొట్టం ఎక్కడం చూశా అని అటూగా పోతున్న ఇంకొక వ్యక్తి చెప్పడంతో చిమ్నీ గొట్టంలోకి పోలీసులు తొంగిచూశారు. అందులో ఇరుక్కుని ఎటూపోలేక అవస్థలు పడుతున్న రాబర్ట్‌ను చూసి పోలీసులకు విపరీతంగా కోపమొచి్చంది. ‘‘నువ్వెంత మూర్ఖుడివిరా బాబు. అందులో దూరి ఎలా దాక్కున్నావనుకున్నాం. 

దాంట్లోంచి అవతలికి పారిపోదామనుకున్నావా?’అంటూ అతడిని ప్రశ్నించారు. ముందుగా అతడిని బయటపడేసే మార్గం కోసం వెతికారు. చివరకు చిమ్నీ అడుగుభాగాన్ని మాత్రం బద్దలుకొట్టి బయటకు తీద్దామని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అగ్నిమాపక సిబ్బందిని పిలిచించి కొన్ని ఇటుకలు తీయించారు. బయటకు వచ్చేయ్‌ అని హెచ్చరించారు. భయపడుతూ ఎలాగోలా అందులోంచి బయటపడిన రాబర్ట్‌ను పోలీసులు పోలీసుల బండిలో పడేశారు. నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి ఇరుక్కునప్పుడు అయిన గాయాలకు ప్రథమ చికిత్స చేయించారు. ప్రస్తుతం కేసు విచారణ నడుస్తోంది.     

– ఫాల్‌ రివర్‌ సిటీ  

#

Tags : 1

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)