Breaking News

యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ..

Published on Fri, 06/30/2023 - 13:37

ఫ్రాన్స్: చాలాకాలం క్రితం రోమ్ నగరం తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి మాత్రం ఫిడేలు వాయించాడని చరిత్ర చెబుతోంది. తాజాగా అదే కథనాన్ని గుర్తు చేస్తూ ఒకపక్క ఫ్రాన్స్ దేశంలో అల్లర్లు చెలరేగుతుంటే మధ్యలో కూర్చుని ఒక యువకుడు మాత్రం ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ కనిపించాడు. 

పారిస్ లోని నాంటెర్రేలో ట్రాఫిక్ స్టాప్ వద్ద నల్ల జాతీయుడైన 17 ఏళ్ల యువకుడు నాహేల్ ను పోలీసులు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగడంతో మూడు రోజులుగా ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. నాహేల్ మృతికి నిరసనగా  పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి పోలీసులపై రాళ్లు రువ్వుతూ ఘర్షణలు పెచ్చుమీరేలా చేశారు. 

పోలీసులకు ఆందోళనకారులకు మధ్య పరస్పర దాడులు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నగరమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మూకలను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. 

పారిస్ పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలతో ఒకపక్క అంతటి విధ్వంసం చెలరేగుతుంటే మరోపక్క ఒక యువకుడు మాత్రం ఇదేమీ పట్టనట్టుగా చాలా ప్రశాంతంగా కూర్చుని సాండ్ విచ్ తింటూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.    

     

ఇది కూడా చదవండి: మోదీ చేసి చూపించారు.. పుతిన్‌ ప్రశంసలు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)