గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్
Breaking News
Viral Video: కూతురి గదిలోకి దూరిన బాయ్‌ఫ్రెండ్.. ఏం చేశారంటే?
Published on Tue, 08/15/2023 - 12:52
Viral Video: బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేస్తుండగా తన తల్లిదండ్రులు ఒక్కసారిగా రావడంతో బిత్తరపోయిన ఓ యువతి ప్రియుడిని బాల్కనీ నుండి పారిపొమ్మని సలహా ఇచ్చింది. దాంతో గాల్లో తాడు పట్టుకుని వేలాడుతూ కిందకు దిగుతున్న ఆ ప్రియుడిని పట్టుకుని ఆమె తల్లి చీపురు తిరగేసి చితక్కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతొంది.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. దొంగచాటుగా తన గర్ల్‌ఫ్రెండ్ గదిలోకి దూరిన ఓ యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తన గర్ల్‌ఫ్రెండ్ మాత్రం తనని కాపాడేందుకు ప్రయత్నించి అతడి బట్టలను బాల్కనీ నుండి కిందకు విసిరేసింది. ఎలాగోలా తాడుని పట్టుకుని కిందకు జారుతున్న అతడిని కింది అంతస్తులో గర్ల్‌ఫ్రెండ్ తల్లి ఒక చీపురు పట్టుకుని చితక్కొట్టేసింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అప్లోడ్ చేసిన గంటల్లోనే మిలియన్ల వీక్షణలు వచ్చాయి. వీడియో చూస్తే ఎవ్వరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పాపం ప్రియుడు ఏ మాత్రం పట్టు తప్పినా అతడు కింద పడే లోపే ప్రాణాలు గాల్లోకి పోవడం ఖాయం.
Every pleasure in life has a price pic.twitter.com/rtHwfFNjtr
— Enezator (@Enezator) August 10, 2023
ఇది కూడా చదవండి: రష్యాలో భారీ పేలుడు.. 12 మంది మృతి
Tags : 1